News January 22, 2025
జనగామ: రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు

జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా జనగామ జిల్లాలోని లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లారీ డ్రైవర్లు, ఓనర్లకు జిల్లా రవాణా అధికారి జీవి శ్రీనివాస్ గౌడ్ రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. డ్రైవర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెలకువల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News November 11, 2025
ఇస్రో షార్‌లో 141 పోస్టులు.. అప్లై చేశారా?

ఇస్రో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లో 141 టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు NOV 14వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, BSc, డిప్లొమా, ITI, టెన్త్, MSc, BE, బీటెక్, ME, ఎంటెక్, బీఎల్ఎస్సీ, నర్సింగ్ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయసు 18 నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. వెబ్‌సైట్: www.isro.gov.in/
News November 11, 2025
ఆర్టీసీకి కార్గో లాభాల పంట!

విజయవాడ RTC జోనల్‌లో కార్గో సేవలు లాభాల పంట పండిస్తున్నాయి. గత ఏడాది మొత్తం రూ.114 కోట్ల ఆదాయం రాగా.. ఈ ఏడాది అక్టోబర్ నాటికే రూ. 120 కోట్లకు పైగా ఆదాయం వచ్చిందని అధికారులు చెబుతున్నారు. కొబ్బరి, అరటి పంట, ఇతర సరుకులను నేరుగా మార్కెట్ నుంచే రవాణా చేయడంతో లాభాలు పెరిగాయని అంటున్నారు. భవిష్యత్తులో ఇంటికి వచ్చే పార్సెల్ పికప్ చేసుకునే సదుపాయాన్ని కూడా తీసుకొచ్చే ఆలోచనలో RTC ఉన్నట్లు తెలుస్తోంది.
News November 11, 2025
నేడు ఘట్కేసర్‌లో అందెశ్రీ అంతక్రియలు.!

తెలంగాణ రాష్ట్ర గేయ రచయిత అందెశ్రీ అకాల మరణం రాష్ట్ర ప్రజల గుండెలను కలచివేసింది. అందెశ్రీ పాడిన పాట, తెలంగాణ కోసం రాసిన రాతలతో పోరాట స్ఫూర్తిని నింపి ఉద్యమాన్ని ముందుకు నడపడంలోనూ కీలక భాగమయ్యారు. ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లటం పట్ల తెలంగాణ పోరాట యోధులు శోకసంద్రంలో మునిగారు. నేడు ఆ మహానీయుడు అంతక్రియలు ఘట్కేసర్‌లో జరగనున్నాయి.


