News January 28, 2025

జనగామ: విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్

image

జనగామ జిల్లా దేవరుప్పుల కేజీబీవీ పాఠశాలను కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సందర్శించి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ ముచ్చటించారు. ఏ తరగతి చదువుతున్నారు? ఏ ఊరు? ఉదయం అల్పాహారం ఎలా ఉంటుంది? సంధ్యా సమయంలో తినే స్నాక్స్ ఏమైనా ఇస్తున్నారా? వంటి పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు.

Similar News

News February 27, 2026

ఫొక్సో కేసులపై నెల్లూరు SP కీలక ఆదేశాలు

image

ఫొక్సో కేసులలో అభియోగ పత్రాల దాఖలు వేగవంతం చేయాలని ఎస్పీ డా.అజిత వేజెండ్ల అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆమె జిల్లా పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సైబర్ ఫ్రాడ్ కేసులలో హోల్డ్ మనీ రికవరీ వేగవంతం కావాలన్నారు. అందుకు సంబందించి అధికారులకు అవగహన కల్పించారు.

News February 27, 2026

ANU దూరవిద్యలో నూతనంగా 5 MBA కోర్సులు

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూరవిద్య కేంద్రం 2026 క్యాలెండర్ సంవత్సరానికి MBA 5 స్పెషలైజేషన్లకు UGC, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో నుంచి అధికారిక అనుమతి లభించినట్లు CDE డైరెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. MBA ప్రవేశ పరీక్షను మార్చి 8 నుంచి మార్చి 15వ తేదీకి మార్చినట్లు తెలిపారు. నూతన కోర్సుల అనుమతి పత్రాలను VC గంగాధరరావు, ఇతర ఉన్నతాధికారుల సమక్షంలో అధికారికంగా ఆయన ప్రకటించారు.

News February 27, 2026

శ్రీశైలం: జల వనరుల శాఖ అధికారా.. మజాకా..!

image

శ్రీశైలం ప్రాజెక్టు జల వనరుల శాఖ C&B ఇన్‌ఛార్జ్ EE తాను చెప్పిందే వేదం అన్నట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుమస్తా స్థాయి వాళ్లకు ఓ న్యాయం, ఇంజినీరింగ్ స్థాయి వాళ్లకు మరో న్యాయమంటూ జీవో నంబర్ 21నే పక్కదారి పట్టిస్తున్న తీరు అధికారులను సైతం విస్మయానికి గురి చేస్తున్నట్లు సమాచారం. GO లేని అంశాలను కూడా తెరపైకి తెస్తూ రిటైర్డ్ ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు విమర్శలున్నాయి.