News October 30, 2025

జనగామ వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్

image

రైల్వే అధికారులు సికింద్రాబాద్ నుంచి జనగామ వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్ ప్రకటించింది. సికింద్రాబాద్ నుంచి విజయవాడ మధ్య నడుస్తున్న శాతవాహన ఎక్స్ ప్రెస్ (12713-12714) నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ రైలు ఇకనుంచి జనగామ స్టేషన్‌లో ఆగుతుందని SCR స్పష్టం చేసింది. ఈ నెల 30 నుంచి ఈ హాల్టింగ్ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని పేర్కొంది. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది.

Similar News

News October 30, 2025

ఆదిలాబాద్: అధిక వర్షాలు.. పత్తి రైతులకు సూచనలు

image

మూడు రోజులుగా ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షాల దృష్ట్యా వ్యవసాయ అధికారులు పత్తి రైతులకు పలు సూచనలు చేశారు. వర్షం పడుతున్నప్పుడు, తగ్గిన వెంటనే తడి పత్తిని తీయరాదని, కేవలం పొడి పత్తిని మాత్రమే తీయాలని కోరారు. తీసిన పత్తిని తడి నేల మీద కాకుండా, పాలిథిన్ షీట్ మీద లేదా పొడి ప్రదేశంలో ఎండబెట్టాలి. తడి పత్తి నిల్వ చేస్తే బూజు పట్టి నష్టపోయే ప్రమాదం ఉందని, ఎండిన పత్తిని మాత్రమే గదిలో నిల్వ చేయాలి.

News October 30, 2025

BIG ALERT: నేడు భారీ వర్షాలు

image

తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో ఇవాళ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. ఆదిలాబాద్, భూపాలపల్లి, ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. మిగతా జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయంది. అటు ఏపీలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వానలు పడవచ్చని వెల్లడించింది.

News October 30, 2025

మల్దకల్: 2025-26 ఆలయ వేలంపాట ఎంత అంటే..!

image

ఆదిశేలా క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 2025-26 సంవత్సరానికి సంబంధించిన టెంకాయల వేలం, తలనీలాల వేలం బుధవారం జరిగింది. ఇందులో టెంకాయల వేలాన్ని మల్దకల్‌కు చెందిన ఉప్పరి నరసింహులు రూ. 22,59,000 లకు దక్కించుకోగా,అలాగే, బ్రహ్మోత్సవాల సందర్భంగా తలనీలాల వేలాన్ని మహబూబ్‌నగర్‌కు చెందిన రామన్ గౌడ్ రూ. 3,17,499 దక్కించుకున్నారని ఈవో సత్య చంద్రారెడ్డి తెలిపారు.