News October 17, 2025
జనగామ: వ్యవసాయ మార్కెట్‌కు ఐదు రోజులు సెలవులు

జనగామ వ్యవసాయ మార్కెట్‌కు ఈనెల 19 నుంచి 23 వరకు సెలవులు ఉంటాయని మార్కెట్ కమిటీ ఛైర్మన్ భానుక శివరాజ్ యాదవ్ తెలిపారు. దీపావళి ఆనవాయితీ ప్రకారం ఈనెల 22, 23వ తేదీల్లో కేదారేశ్వర వ్రతాల సెలవులు కాగా.. 19న సాధారణ సెలవు, 20న దీపావళి, 21న అమావాస్య సెలవులు ఉంటాయని పేర్కొన్నారు. తిరిగి 24న మార్కెట్ పునః ప్రారంభం అవుతుందన్నారు.
Similar News
News October 17, 2025
3 రోజులు సెలవులు!

TG: రేపటి నుంచి స్కూళ్లకు వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. రేపు రాష్ట్రవ్యాప్తంగా బంద్ ఉండటంతో ఇప్పటికే పలు విద్యాసంస్థలు శనివారం సెలవు ప్రకటించాయి. ఎల్లుండి ఆదివారం, సోమవారం దీపావళి సెలవులు రానున్నాయి. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకూ వరుసగా 3 రోజులు హాలిడేస్ వచ్చాయి. మరి లాంగ్ వీకెండ్ నేపథ్యంలో మీరు ఎక్కడికి వెళ్తున్నారు? సెలవులు ఎలా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారో కామెంట్ చేయండి.
News October 17, 2025
సుర్యాపేట: అబ్దుల్ కలాం మాటలను స్ఫూర్తిగా తీసుకోవాలి: కలెక్టర్

ఆకాశమే హద్దుగా కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి అని చెప్పిన అబ్దుల్ కలాం మాటలను స్ఫూర్తిగా తీసుకొని ఆచరణలోకి తీసుకొని రావాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ విద్యార్థులకు సూచించారు. కలెక్టరేట్‌లో మహిళా, శిశు, దివ్యాంగులు, వయో వృద్ధుల శాఖలోని మహిళా సాధికారత ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ బాలిక దినోత్సవం-2025 కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు.
News October 17, 2025
రేపు ఉద్యోగ సంఘాలతో మంత్రుల బృందం భేటీ

AP: సీఎం చంద్రబాబు ఆదేశాలతో మంత్రుల బృందం రేపు 12 PMకు సచివాలయంలో ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపనుంది. మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్ ఉద్యోగులకు డీఏ సహా వివిధ ఆర్థిక అంశాలపై చర్చించనున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సీఎం మంత్రులను ఆదేశించారు.