News April 23, 2025

జనగామ: వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో కమిటీ పాలకవర్గ సమావేశం

image

జనగామ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో మార్కెట్ ఛైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ అధ్యక్షతన మార్కెట్ కమిటీ పాలకవర్గ సమావేశం నిర్వహించారు. శివరాజ్ యాదవ్ మాట్లాడుతూ.. ముఖ్యమైన అభివృద్ధి పనులు ఎజెండాగా పెట్టి జనగామ వ్యవసాయ మార్కెట్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని, అదేవిధంగా రైతులకు ఎప్పుడు అందుబాటులో ఉండాలని పాలక మండలి సభ్యులకు సూచించారు.

Similar News

News April 23, 2025

నేడు HYDకు సీఎం రేవంత్

image

TG: జపాన్‌లో సీఎం రేవంత్ పర్యటన ముగిసింది. ఇవాళ ఆయన తన బృందంతో కలిసి హైదరాబాద్ చేరుకోనున్నారు. ఈనెల 15న ఆయన జపాన్‌కు వెళ్లారు. ఈ పర్యటనలో సుమారు రూ.12వేల కోట్ల ఒప్పందాలు చేసుకున్నారు. ఈ పెట్టుబడుల ద్వారా దాదాపు 30,500 ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం వెల్లడించింది. HYDలో ఎకో టౌన్ అభివృద్ధికి జపాన్‌తో డీల్ కుదుర్చుకున్న సీఎం, మూసీ సుందరీకరణ ప్రాజెక్టు కోసం ఆ దేశంలోని రివర్ ఫ్రంట్‌లను పరిశీలించారు.

News April 23, 2025

BCF వనపర్తి జిల్లా ఉపాధ్యక్షుడిగా మేదరి ఆంజనేయులు

image

వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణ వాసి మేదరి ఆంజనేయులుని BCF వనపర్తి జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగనమోని చెన్న రాములు ముదిరాజ్ నియామక పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో BCF రాష్ట్ర కార్యదర్శి రామన్ గౌడ్, SCF రాష్ట్ర కార్యదర్శి బహుజన రమేశ్, మహాజన రైతు సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంధ్యపాగ వెంకటేశ్, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పల్లెమోని మన్యం, శివకుమార్ పాల్గొన్నారు.

News April 23, 2025

NZB: తల్లికి క్యాన్సర్.. కొడుకు ఆత్మహత్య

image

తల్లి క్యాన్సర్‌తో బాధపడుతూ ఉండటంతో మనస్తాపం చెందిన కొడుకు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన డిచ్‌పల్లిలో మంగళవారం వెలుగు చూసింది. ఎస్ఐ షరీఫ్ కథనం ప్రకారం.. కమలాపూర్‌కు చెందిన కర్రినోల్ల భూలక్ష్మి కొన్ని సంవత్సరాలుగా కాన్సర్‌తో పడపడుతోంది. ఇది జీర్ణించుకోలేక కొడుకు రంజిత్(28) ఈ నెల 21న పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు పోలీసులు వివరించారు.

error: Content is protected !!