News October 16, 2025
జనగామ: సీట్లు రాని వారికి మరో అవకాశం!

ప్రవేశ పరీక్ష రాసి గురుకులాల్లో సీట్లు రాని వారికి గురుకులం మరో అవకాశాన్ని కల్పించింది. జిల్లాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 5, 6, 7, 9 తరగతుల్లో మిగిలిన సీట్లను భర్తీ చేసేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీ వెల్ఫేర్ సమన్వయ అధికారి శ్రీనివాస్ రావు తెలిపారు. నేడు(గురువారం), రేపు(శుక్రవారం) జనగామలోని సోషల్ వెల్ఫేర్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
Similar News
News October 16, 2025
ట్రంప్ ‘ఆయిల్’ కామెంట్స్‌పై భారత్ స్పందన

రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయబోమంటూ మోదీ హామీ ఇచ్చారన్న ట్రంప్ <<18018198>>వ్యాఖ్యలపై<<>> భారత్ స్పందించింది. తాము ఆయిల్, గ్యాస్ ప్రధాన దిగుమతిదారని, దేశంలోని వినియోగదారుల ప్రయోజనాలను బట్టే కొనుగోలు చేస్తామని MEA అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. దీని ఆధారంగానే తమ ఇంధన దిగుమతి విధానాలు రూపొందించామన్నారు. అటు ఇంధన సేకరణ పెంచుకోవడానికి అమెరికాతోనూ చర్చలు కొనసాగుతున్నాయని వివరించారు.
News October 16, 2025
వికారాబాద్: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. కోట్‌పల్లి మండలం మోత్కుపల్లికి చెందిన అంతగిరిపల్లి శ్రీను(25) వికారాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. శ్రీను బైక్ పై వికారాబాద్‌కు వెళ్తుండగా బ్రిడ్జి సమీపంలో వేగంగా ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ మేరకు మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
News October 16, 2025
బిహార్‌లో.. రాజు లేని యుద్ధం.. గెలుస్తారా..?

మనం చూడని చరిత్రలో, చూసిన బాహుబలిలో, ఆడే చెస్‌లో రాజు లేడంటే ఆ యుద్ధం ముగిసి, ప్రత్యర్థి గెలిచినట్లే. కానీ ప్రశాంత్ కిషోర్ ఈ సహజ విధానానికి భిన్నంగా ఆలోచిస్తున్నారు. ఎన్నో పార్టీలకు వ్యూహకర్తగా వెనకుండి నడిపించిన ఆయన బిహార్‌లో జనసురాజ్ పార్టీ పెట్టారు. ఇక్కడా తను పోటీ చేయకుండా JSP అభ్యర్థుల గెలుపు కోసం పని చేస్తానని ప్రకటించారు. దీంతో ప్రత్యర్థుల విమర్శలకు ఎలా బదులివ్వాలో సొంత నేతలకే తెలియట్లేదు.