News November 5, 2025
జనగామ: సీసీఐ కొర్రీలు.. దళారుల దండు!

జిల్లాలో క్వింటాకు ₹8,100 మద్దతు ధరకు సీసీఐ పత్తి కొనుగోళ్లు ప్రారంభించినా, రైతులకు కొర్రీలు ఎదురవుతున్నాయి. స్లాట్ బుక్ చేసుకుని పత్తి తెస్తే.. కాయలు, తేమ ఎక్కువ ఉన్నాయని తిరస్కరిస్తున్నారు. దీంతో చేసేది లేక పురుగులు, వర్షాలతో ఇప్పటికే నష్టపోయిన రైతులు, దళారుల పాలు అవుతున్నారు. వారు ₹5,000కే ప్రైవేటుగా అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆంక్షలు లేకుండా కొనుగోళ్లు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
Similar News
News November 5, 2025
2,500 విద్యాసంస్థలు మూతబడ్డాయి.. బండి సంజయ్ ఫైర్

TG: కాంగ్రెస్ ప్రభుత్వం విద్యావ్యవస్థను నీరుగార్చుతోందని కేంద్రమంత్రి బండి సంజయ్ విమర్శించారు. ‘రాష్ట్ర చరిత్రలో తొలిసారి 2,500 విద్యాసంస్థలు మూతబడ్డాయి. BRS పాలనలో రెండేళ్లు, కాంగ్రెస్ పాలనలో రెండేళ్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు రాక స్టూడెంట్స్, స్టాఫ్ ఇబ్బందులు పడుతున్నారు. రూ.10,500 కోట్ల బకాయిల్లో సగం చెల్లించమని యాజమాన్యాలు కోరినా ప్రభుత్వం కమిటీలంటూ కాలయాపన చేస్తోంది’ అని ట్వీట్ చేశారు.
News November 5, 2025
మెదక్: కస్తూర్బా విద్యాలయంలో ఉద్యోగ అవకాశాలు

రామాయంపేట మండల కేంద్రంలోని KGBV నిజాంపేటలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్టు ప్రత్యేక అధికారిని రాణి తెలిపారు. వంట మనిషి, సహాయం వంటమనిషి, వాచ్‌మెన్, స్వీపర్, స్కావెంజర్ పోస్టులు భర్తీ చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు 18 నుంచి 45 సంవత్సరాల మహిళలు ఈనెల 10వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News November 5, 2025
ఇలా అయితే థియేటర్లు ఖాళీ అవుతాయ్: సుప్రీం

మూవీ టికెట్‌తో పాటు థియేటర్లలో తినుబండారాల ధరలు భారీగా పెరగడంపై సుప్రీంకోర్టు సైతం ఆందోళన వ్యక్తం చేసింది. ‘ప్రస్తుతం ఒక సినిమాకి ₹1,500 నుంచి ₹2,000కు ఖర్చవుతుంది. ధరలను నియంత్రించకపోతే సినిమా హాళ్లు త్వరలోనే ఖాళీగా మారే ప్రమాదం ఉంది’ అని కోర్టు పేర్కొంది. కర్ణాటకలో మూవీ టికెట్ ధరను రూ.200కు పరిమితం చేయడంపై మల్టీప్లెక్స్ అసోసియేషన్ సుప్రీంను ఆశ్రయించగా ఈ విధంగా స్పందించింది.


