News April 17, 2025

జనగామ: స్కానింగ్, డయాగ్నొస్టిక్ సెంటర్లలో అధికారుల తనిఖీ

image

జనగామలో స్కానింగ్, డయాగ్నొస్టిక్ సెంటర్లపై జిల్లా వైద్యాధికారి డా.మల్లిఖార్జున్ రావు, ఆరోగ్యశాఖ అధికారులు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా న్యూ విజయ స్కానింగ్ సెంటర్‌ను మూడు రోజులు మూసివేసి, రూ.50 వేలకు పైగా జరిమానా విధించినట్లు చెప్పారు. అనుమతి లేని సిటీ ఐ కేర్ & సాయి స్కానింగ్ సెంటర్లను మూసివేశారు. నిబంధనలకు విరుద్ధంగా హాస్పిటల్ యాజమాన్యాలు వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Similar News

News April 19, 2025

నేడు జీవీఎంసీ మేయర్‌పై అవిశ్వాస తీర్మానం

image

AP: గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్(GVMC) మేయర్ జి. హరి వెంకట కుమారిపై నేడు అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టనున్నారు. ఈ మేరకు ఇన్‌ఛార్జ్ కమిషనర్, కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అధ్యక్షతన ఉ.11కు కౌన్సిల్ సమావేశం కానుంది. మేయర్ పీఠం దక్కించుకునేందుకు తమ వద్ద 74మంది కార్పొరేటర్లు ఉన్నారని కూటమి నేతలు ధీమాగా ఉండగా, విప్‌కు వ్యతిరేకంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని YCP తమ కార్పొరేటర్లను హెచ్చరించింది.

News April 19, 2025

నాగర్‌కర్నూల్: ‘ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలి’

image

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ రైతు సంఘం కార్యాలయంలో శుక్రవారం రైతు సంఘం జిల్లా నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడారు. వరి కోతలు ప్రారంభమై పది రోజులు దాటినా జిల్లాలో ఇంకా వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని, వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సి.బాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

News April 19, 2025

విజయవాడలో రోడ్డు ప్రమాదం (UPDATE)

image

విజయవాడ గన్నవరం జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. గన్నవరం నుంచి విజయవాడ వైపు వెళుతున్న లారీ డ్రైవర్‌కు ప్రసాదంపాడు వద్ద గుండెపోటు రావడంతో డ్రైవర్ రామకృష్ణ అక్కడికక్కడే మరణించాడు. ఫుట్ పాత్‌పై లారీ దూసుకెళ్లడంతో నడుచుకొని వెళ్తున్న రామసాయి(18) స్పాట్‌లోనే మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. లారీ డ్రైవర్ పామర్రుకు చెందిన  వ్యక్తిగా గుర్తించారు.

error: Content is protected !!