News March 9, 2025

జనగామ: స్పోర్ట్స్ గ్రాంట్ నిధులు మంజూరు

image

పాఠశాలల్లో క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఇందులో భాగంగా జనగామ జిల్లాలోని 450 పాఠశాలకు రూ.48,25,000 నిధులను విడుదల చేసింది. ఈమేరకు ఆయా పాఠశాలలకు సంబంధించిన ఖాతాల్లోకి నిధులు జమ చేసింది. వచ్చిన నిధులతో ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, యాజమాన్యం ఆట వస్తువులు కొనుగోలు చేస్తున్నారు.

Similar News

News March 9, 2026

MBNR: డిగ్రీ.. దరఖాస్తుల ఆహ్వానం

image

మహబూబ్‌నగర్‌లోని(దొడ్డలోనిపల్లి) తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో చేరెందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ Dr.జె.జయప్రద ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. నూతన ఏడాదికి గాను అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని, నేరుగా కళాశాలలో దరఖాస్తులు చేసుకోవచ్చని, రిజర్వేషన్ & మెరిట్ ఆధారితంగా సీట్లు కేటాయిస్తామని, ఈ అవకాశాన్ని ఉమ్మడి జిల్లా మహిళా అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News March 9, 2026

VKB: అక్రమంగా కలప రవాణా.. పట్టించుకోని అధికారులు

image

ఎక్కడపడితే అక్కడ పొలాల వెంట అడవులలో చెట్లను అక్రమాలు అందరికీ రవాణా చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు పేర్కొంటున్నారు. వికారాబాద్ జిల్లాలోని ధారూర్, మోమిన్‌పేట్ మండలాల్లో అక్రమంగా చెట్లను నరికి రవాణా చేసి కాసుల పంట పండించుకుంటున్నారు. అటవీశాఖ అధికారులు రెవెన్యూ శాఖ అధికారులు వెంటనే స్పందించి అక్రమ కలప రవాణాను అరికట్టి పర్యావరణాన్ని కాపాడాలని కోరుతున్నారు.

News March 9, 2026

MBNR: ఈనెల 11 నుంచి అంబేడ్కర్ వర్సిటీ ప్రాక్టికల్స్

image

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని MVS ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం సైన్స్, కంప్యూటర్స్ విద్యార్థులకు 1వ సెమిస్టర్ ప్రయోగ తరగతులు ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్నాయి. 80% హాజరు ఉన్న విద్యార్థులనే అనుమతిస్తారని రీజినల్ కోఆర్డినేటర్ డాక్టర్ జి.సత్యనారాయణ గౌడ్ తెలిపారు. మరిన్ని వివరాలకు 73829 29609 నంబరును సంప్రదించాలని ఆయన సూచించారు.