News April 18, 2024

జనగామ: హత్య కేసులో ముగ్గురికి రిమాండ్

image

హత్య కేసులో ముగ్గురు నిందితులను బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పట్టణ సీఐ రఘుపతి రెడ్డి తెలిపారు. ఈ నెల 15న జనగామ ఆర్టీసీ చౌరస్తాలో పట్టణంలోని బాణాపురం వాసి బోయిని భాస్కర్‌ను కర్రలతో కొట్టి అతని మృతికి కారణమయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రఘునాథపల్లికి చెందిన కుర్ర కమలాకర్, కుర్ర కళాధర్, చిల్పూర్‌కు చెందిన చిర్ర శ్రవణ్‌ను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.

Similar News

News January 11, 2025

ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రైమ్ న్యూస్..

image

> HNK: విద్యుత్ షాక్ తో ఒకరి మృతి..> MLG: మూడు పల్టీలు కొట్టిన కారు..> JN: పాలకుర్తిలో తప్పిన ప్రమాదం.. బస్సు కిందికి దూసుకెళ్లిన బైకు > MHBD: బామ్మర్దిపై కత్తితో బావ దాడి> WGL: ఈర్యా తండా సమీపంలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ గాయాలు> JN: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి> WGL: రోడ్ సేఫ్టీపై అవగాహన..

News January 10, 2025

కోటగుళ్ళలో ముక్కోటి శోభ

image

గణపురం మండల కేంద్రంలోని గణపేశ్వరాలయం కోటగుళ్ళలో ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపతి నందీశ్వరుని పూజతో మొదలుకొని స్వామివారికి రుద్రాభిషేకం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

News January 10, 2025

కొడకండ్ల: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

image

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటన జనగామ జిల్లా కొడకండ్ల మండలం జర్నీ తండా వద్ద గురువారం రాత్రి జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. డీసీఎం, తుఫాన్ వాహనం ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. మృతులు సూర్యాపేట జిల్లా ఈటూరు గ్రామానికి చెందిన పేరాల జ్యోతి, పేరాల వెంకన్నగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.