News October 20, 2025

జనగామ: 154 ఆర్టీఐ దరఖాస్తులకు పరిష్కారం

image

ఇటీవల జనగామ కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ)లో దరఖాస్తులను పరిష్కరించి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా అవార్డుగా అందుకున్న విషయం తెలిసిందే. అయితే రాష్ట్ర స్థాయిలో పెండింగ్‌లో ఉన్న 174 అప్పీళ్లను 154 పరిష్కరించి రాష్ట్ర స్థాయిలో పరిష్కారాల్లో జిల్లా తృతీయ స్థానంలో నిలిచింది. ఆర్టీఐ దరఖాస్తులు పెండింగ్ లేకుండా ప్రతివారం రివ్యూ చేస్తున్నారు.

Similar News

News October 20, 2025

2023లో ఎంతమంది పుట్టారంటే?

image

దేశవ్యాప్తంగా 2023 JAN 1 నుంచి DEC 31 వరకు జిల్లాల వారీగా నమోదైన జనన, మరణాలపై సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్(CRS) నివేదికను కేంద్ర హోంశాఖ రిలీజ్ చేసింది. APలో 7,62,093 జననాలు, 4,42,218 మరణాలు, TGలో 6,52,688 జననాలు, 2,40,058 మరణాలు నమోదయ్యాయి. జననాల్లో APలో కర్నూలు, కడప, అనంతపురం, TGలో HYD, NZB, కామారెడ్డి తొలి 3 స్థానాల్లో నిలిచాయి. 2 రాష్ట్రాల్లో ఏ జిల్లాలోనూ లక్షకుపైగా జననాలు నమోదు కాలేదు.

News October 20, 2025

జనగామ: మద్యం టెండర్ల దాఖలకు గడువు పొడిగింపు

image

మద్యం టెండర్ల దాఖలుకు గడువును ఈనెల 23 వరకు పొడిగించినట్లు జనగామ జిల్లా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి అనిత తెలిపారు. జిల్లాలోని 50 మద్యం దుకాణాలకు టెండర్లను ఆహ్వానించగా ఇప్పటి వరకు 1,600 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. గడువు పొడిగించడంతో మరికొన్ని దరఖాస్తులు వచ్చే అవకాశాలున్నాయన్నారు.

News October 20, 2025

మంచిర్యాల: పండగపూట భార్యను చంపిన భర్త

image

పండుగ పూట మంచిర్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నేషనల్ హైవే బ్రిడ్జి వద్ద గృహిణి హత్యకు గురైంది. ఆమె భర్త కుమార్ గొంతు నులిమి చంపి బ్రిడ్జిపై నుంచి పడేసినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న మంచిర్యాల రూరల్ సీఐ అశోక్ ఆధ్వర్యంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.