News October 16, 2025
జనగామ: 18న విద్యాసంస్థల బంద్: జేఏసీ

బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్త కార్యాచరణలో భాగంగా ఈనెల 18న జనగామ జిల్లాలోని విద్యాసంస్థలను బంద్ చేయనున్నట్లు బీసీ జేఏసీ ప్రతినిధులు తీర్మానించారు. కావున ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, ప్రభుత్వరంగ పరిధిలోని విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్‌కు సహకరించాలని కోరారు.
Similar News
News October 16, 2025
అశ్వారావుపేట: పోరుకు పుంజులు సన్నద్ధం..!

అశ్వారావుపేట మండలానికి చెందిన ఓ రైతు సంక్రాంతి కోసం తన పొలంలో వందలాది కోడి పందెం పుంజులను పెంచుతున్నాడు. గ్రీన్ హీట్ కంచెలు, ఇనుప గంపలు, తాటి ఆకులతో ఏర్పాటు చేసిన రక్షణ గోడలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పండుగ దగ్గర పడుతుండటంతో పుంజులను కొనుగోలు చేసేందుకు వ్యాపారులు, కొనుగోలుదారులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు.
News October 16, 2025
ఎల్లుండి బంద్.. స్కూళ్లు, కాలేజీలు నడుస్తాయా?

TG: బీసీ సంఘాలు పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్‌కు బీఆర్ఎస్, బీజేపీ సంపూర్ణ మద్దతు తెలిపాయి. ఈ నెల 18న బంద్ ప్రభావం స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులపై కచ్చితంగా ఉండే అవకాశం ఉంది. ఫలితంగా పలు విద్యాసంస్థలు ముందుగానే సెలవు ప్రకటించే ఛాన్స్ ఉంది. అలాగైతే స్కూళ్లు, కాలేజీలకు శనివారం, ఆదివారంతో పాటు సోమవారం(దీపావళి) కలిపి మూడు రోజులు వరుస సెలవులు రానున్నాయి.
News October 16, 2025
పడిపోయిన అన్ని రకాల మిర్చి ధరలు

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మిర్చి ధరలు మళ్లీ తగ్గాయి. తేజ మిర్చి క్వింటా బుధవారం రూ.14,850 ధర వస్తే.. నేడు రూ.14,450కి పడిపోయింది. అలాగే 341 రకం మిర్చి క్వింటాకు నిన్న రూ.15,900 ధర పలకగా.. ఈరోజు రూ.15,500 కి తగ్గింది. వండర్ హాట్(WH) మిర్చికి బుధవారం రూ.16,500 ధర వస్తే.. నేడు రూ.16,200కి పతనమైంది. అలాగే దీపిక మిర్చికి రూ.14,800 ధర వచ్చింది.