News February 2, 2025

జనగామ: 23 ప్రాక్టికల్ కేంద్రాలు.. 4,714 మంది విద్యార్థులు

image

రేపటి(సోమవారం) నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం ప్రాక్టికల్ పరీక్షలకు జనగామ జిల్లాలో 23 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు డీఐఈఓ జితేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో జనరల్, వోకేషనల్ విద్యార్థులు 4,714 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు పేర్కొన్నారు.  

Similar News

News November 11, 2025

22,861 మందికి సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు: మంత్రి సత్యకుమార్

image

APలో 39L మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించినట్లు మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. 22,861మందిలో సర్వైకల్, 9,963మందిలో బ్రెస్ట్, 26,639మందిలో నోటి క్యాన్సర్ లక్షణాలను గుర్తించామన్నారు. వీరిని బోధనాస్పత్రుల్లోని ఆంకాలజిస్టులు మరోసారి పరీక్షించి వ్యాధి నిర్ధారణ, చికిత్స అందిస్తారని చెప్పారు. క్యాన్సర్‌పై ప్రజల్లో అవగాహన కల్పించాలని, మళ్లీ స్క్రీనింగ్ చేపట్టాలని అధికారులకు సూచించారు.

News November 11, 2025

జగిత్యాల జిల్లా దిశా కమిటీ సమావేశంలో ఎంపీ అరవింద్

image

జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ కార్యాలయంలో దిశా కమిటీ సమావేశం మంగళవారం జరిగింది. ఇందులో చైర్మన్ హోదాలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పాల్గొని కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, వాటి పనితీరుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. జగిత్యాల MLA డా.సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, అడిషనల్ కలెక్టర్లు బీఎస్.లత, రాజ గౌడ్, దిశా కమిటీ సభ్యులు, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.

News November 11, 2025

NGKL: ‘పీఎం ధాన్ ధాన్య కృషి యోజన అమలు పక్కాగా చేయాలి’

image

నాగర్‌కర్నూల్ జిల్లాలో రానున్న ఆరేళ్లపాటు పంట ఉత్పాదకత పెంచడం, పంటల మార్పిడి, సుస్థిర వ్యవసాయ విధానాలను ప్రోత్సహించే విధంగా ప్రధానమంత్రి ధాన్ ధాన్య కృషి యోజన అమలుకు సమగ్ర కార్యాచరణ వార్షిక ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు. మంగళవారం అదనపు కలెక్టర్ దేవ సహాయంతో కలిసి సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ, పశుసంవర్ధక తదితర శాఖల పనితీరును అడిగి తెలుసుకున్నారు.