News December 14, 2025

జనగామ: 51.10% పోలింగ్ @11AM

image

జనగామ జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు ఉదయం 7 నుంచి ప్రారంభమయ్యాయు. 11 గంటల వరకు నాలుగు మండలాల్లో కలిపి 51.10 శాతం పోలింగ్ నమోదయింది. బచ్చన్నపేటలో 45.77 శాతం, జనగామలో 49.28 శాతం, తరిగొప్పులలో 56.77 శాతం, నర్మెట్టలో 60.02 శాతం నమోదయింది. నియోజకవర్గంలో అత్యధికంగా నర్మెట్ట మండలంలో పోలింగ్ పర్సంటేజ్ ఎక్కువగా నమోదయింది.

Similar News

News December 14, 2025

అనకాపల్లి జిల్లా ప్రభుత్వ లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సుందర్రావు

image

జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాలల లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కె.సుందర్రావు (మాకవరపాలెం) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం అనకాపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. ఉపాధ్యక్షుడిగా ఆర్.గంగరాజు, కార్యదర్శిగా కె.ప్రేమ్ కుమార్, మహిళా కార్యదర్శిగా పీఆర్.కళ్యాణి ఎన్నికయ్యారు. సంయుక్త కార్యదర్శిగా బీ.ఉమారాణి, కోశాధికారిగా శ్రీనివాసరావు, జిల్లా కౌన్సిలర్‌గా స్వామి ఎన్నికయ్యారు.

News December 14, 2025

ఇతిహాసాలు క్విజ్ – 96 సమాధానం

image

ఈరోజు ప్రశ్న: సూర్యుడి వేడిని తాళలేక తన లాంటి రూపమున్న స్త్రీని సృష్టించి, సూర్యుని వద్ద ఉంచి, అశ్వ రూపంలో అడవులకు వెళ్లిపోయింది ఎవరు?
సమాధానం: సూర్య భగవానుడి భార్య అయిన సంజ్ఞా దేవి తనలాగే ఉండే ఛాయాదేవిని సృష్టించి అడవులకు వెళ్లిపోయింది. సూర్యుని ద్వారా సంజ్ఞా దేవికి యముడు, యమున జన్మించారు. ఛాయాదేవికి శని, సావర్ణి, తపతి జన్మించారు. <<-se>>#Ithihasaluquiz<<>>

News December 14, 2025

ఉసిరితో మహిళలకు ఎన్నో లాభాలు

image

ఉసిరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని తెలిసిందే. ముఖ్యంగా మహిళలకు ఇది చాలా ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. హార్మోన్లను సమతుల్యం చేయడంలో, PCOD, డయాబెటీస్‌ను తగ్గించడంలో ఇది కీలకంగా పనిచేస్తుంది. అలాగే జుట్టు, చర్మ ఆరోగ్యాన్ని పెంచడంతో పాటు జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపుతుంది. దీన్ని పచ్చిగా, ఎండబెట్టి పొడిలా, పచ్చడి, జ్యూస్ ఇలా నచ్చిన విధంగా తీసుకోవచ్చంటున్నారు.