News September 24, 2025
జనగామ: 76 వేల మందికి రూ.500లకే వంట గ్యాస్..!

నానాటికి పెరుగుతున్న ధరల ప్రభావం పేద ప్రజలపై పడకూడదన్న సంకల్పంతో ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద రూ.500లకే వంట గ్యాస్ సరఫరా చేస్తోంది. ఇందులో భాగంగా జనగామ జిల్లాలో ఇప్పటివరకు 76,430 మంది వినియోగదారులకు 500లకే వంట గ్యాస్ సరఫరా చేశారు. కొత్త రేషన్ కార్డులు వచ్చిన నేపథ్యంలో వినియోగదారులు మరింత పెరిగే అవకాశం ఉంది.
Similar News
News September 24, 2025
కూకట్‌పల్లిలో ఇంట్లోకి వెళ్లి దాడి.. అక్రమ సంబంధమే కారణమా !

కూకట్‌పల్లి సుమిత్రానగర్‌లో ముసుగులు ధరించిన ఇద్దరు ఇంట్లోకి చొరబడి భూపాల్‌పై దాడి చేశారు. ఈ క్రమంలో తన భార్య చంద్రకళ వివాహేతర సంబంధంపై భూపాల్ అనుమానం వ్యక్తం చేశారు. 5ఏళ్ల క్రితం తమ పెళ్లి జరగ్గా, ప్రస్తుతం ఆమె మరో వ్యక్తితో వివహేతర సంబంధం ఉందని, ఆ విషయమై గొడవ జరగడంతో దుర్గయ్య అనే వ్యక్తితో కలిసి ఆమె దాడి చేయించిందని భూపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News September 24, 2025
నవదుర్గలు – అలంకారాలు

బాలాత్రిపుర సుందరీ దేవి: లేత గులాబీ రంగు చీర, తుమ్మి పుష్పం
గాయత్రీ దేవి: నారింజ రంగు చీర, తామర పుష్పం
అన్నపూర్ణా దేవి: గంధం రంగు చీర, పొగడ పుష్పం
లలితా త్రిపుర సుందరీ దేవి: బంగారు రంగు చీర, ఎర్ర కలువ
మహాలక్ష్మీ దేవి: గులాబీ రంగు చీర, తెల్ల కలువ
సరస్వతీ దేవి: తెల్ల చీర, మారేడు దళాలు
దుర్గాదేవి: ఎర్ర చీర, మందారాలు
మహిషాసుర మర్దని: ఎరుపు నేత చీర, నల్ల కలువ
రాజరాజేశ్వరీ దేవి: ఆకుపచ్చ చీర, ఎర్ర పూలు
News September 24, 2025
నవదుర్గలు – పఠించాల్సిన మంత్రాలు (1/2)

1. బాలాత్రిపుర సుందరీ దేవి: ఐం క్లీం సౌ: సౌ: క్లీం ఐం నమ:
2. శ్రీ గాయత్రీ దేవి: ఓం శ్రీ గాయత్రీ మాత్రే నమ:
3. శ్రీ అన్నపూర్ణా దేవి: హ్రీం శ్రీం క్లీం అన్నపూర్ణాయే నమ:
4. లలితా త్రిపుర సుందరీ దేవి: ఓం హ్రీం శ్రీం క్లీం లలితా దేవ్యై నమ:
5. శ్రీ మహాలక్ష్మీ దేవి: శ్రీం హ్రీం ఐం మహాలక్ష్మై నమ: