News February 14, 2025

జనగామ: GREAT.. ప్రేమ పెళ్లి.. 4 ప్రభుత్వ ఉద్యోగాలు

image

జనగామ జిల్లా పాలకుర్తి మండలం రాఘవపురం గ్రామానికి చెందిన కుమార్-మమత 2009లో పెద్దల్ని ఎదిరించి కులాంతర వివాహం చేసుకున్నారు. కుమార్ తన చదువును మధ్యలో ఆపేసి ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ భార్యని చదివించారు. 2020లో గురుకుల, హైస్కూల్ మమత పీఈటీగా సెలెక్ట్ అయి భూపాలపల్లి జిల్లాలో పనిచేస్తోంది. కుమార్ వివిధ పనులు చేస్తూనే చదివి గురుకుల, హై స్కూల్ పీఈటీగా జాబ్ రాగా.. జనగామ జిల్లాలో పని చేస్తున్నారు.

Similar News

News November 8, 2025

VZM: ఈనెల 12న YSRCP ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు

image

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 12న జిల్లా వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నామని జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు. శనివారం విజయనగరంలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే కోటి సంతకాల సేకరణ చేపట్టామని ప్రజల్లో మంచి స్పందన వచ్చిందన్నారు. గత 17 నెలల్లో ప్రభుత్వం రూ.2 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిందని, మెడికల్ కాలేజీకి మాత్రం నిధులు కేటాయించలేకపోతోందని ప్రశ్నించారు.

News November 8, 2025

జూబ్లీ బైపోల్: మీకేం కావాలి? ఎంత కావాలి?’

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం రేపటితో క్లోజ్. ఇక వీధులు, బస్తీలు నిర్మానుష్యంగా మారుతాయి. సీన్ కట్ చేస్తే ప్రధాన నాయకుల ఇళ్లకు, గెస్ట్ హౌసులకు షిఫ్ట్ అవుతుంది. ప్రచారం ముగియగానే మంతనాలు షురూ అవుతాయి. గంపగుత్తగా ఓట్లు వేయించే వారిని ఇంతకుముందే గుర్తించిన నాయకులు వారితో రేపు చర్చలు జరిపే అవకాశముంది. ప్రతీ ఎన్నికల ముందులాగే.. మీకేం కావాలి? ఎంత కావాలి? అంటూ ప్రలోభపెడుతూ ఓట్లు రాబట్టుకునే పనిలో ఉంటారు.

News November 8, 2025

తిరుపతి: న్యూ లుక్‌లో పవన్ కళ్యాణ్

image

న్యూ లుక్‌లో డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ని అలరిస్తున్నారు. ఫారెస్ట్ ఆఫీసర్ డ్రెస్ కోడ్‌తో తిరుపతిలో ఆయన పర్యటించారు. కెన్నెట్ అండర్సన్ రాసిన మ్యాన్ ఈటర్స్ అండ్ జంగల్ కిల్లర్స్ బుక్‌ను ఫారెస్ట్‌లో చదివి ఆహ్లాద వాతావరణంలో ఆనందంగా కనిపించారు. మామండూరు అందాలకు మంత్రముగ్ధుడయ్యారు. జలపాతం అందాలను చూసి మైమరచి పోయారు. 105 ఏళ్ల నాటి అతిథి గృహాన్ని సందర్శించడంతోపాటు ఆ ప్రదేశంలో మొక్కలు కూడా నాటారు.