News July 5, 2025
జనగామ: IIIT బాసరకు 8 మంది విద్యార్థినులు!

జనగామ జిల్లా కొడకండ్ల TGRS(G) నుంచి 8 మంది విద్యార్థినులు IIIT బాసరకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ తమ్మి దిలీప్ కుమార్ తెలిపారు. పదో తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన హారిక, మోక్షజ్ఞ, వైష్ణవి, ఇందు, కార్తీక, శ్రీజ, నాగేశ్వరి, వేదన సీటు సాధించినట్లు చెప్పారు. ఈ విజయానికి సహకరించిన ఉపాధ్యాయ బృందంతో పాటు తల్లిదండ్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News July 5, 2025
సంగారెడ్డి జిల్లాకు 19 ప్రభుత్వ పాఠశాలలు మంజూరు

సంగారెడ్డి జిల్లాకు నూతనంగా 19 ప్రభుత్వ పాఠశాలలను మంజూరు చేస్తూ విద్యాశాఖ కమిషనర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. జహీరాబాద్ మండలానికి 10, సంగారెడ్డి మండలానికి 4, రామచంద్రపురం మండలానికి 4, సదాశివపేట మండలానికి ఒక పాఠశాల మంజూరైనట్లు వెల్లడించారు.
News July 5, 2025
తెనాలి: మళ్లీ పెరుగుతున్న టమాటా ధరలు

ఇటీవల తగ్గిన కూరగాయల ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా టమాటా ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. రెండు రోజుల కిందట రైతు బజార్లలో కిలో రూ.18 ఉన్న టమాటా శనివారానికి రూ.33కి చేరింది. రిటైల్ మార్కెట్‌లో ఈ ధర మరింత అధికంగా ఉంది. పచ్చిమిర్చి రూ.40, వంకాయ రూ.34, దొండ రూ.36, బెండ రూ.24 పలుకుతున్నాయి. మీ ప్రాంతాల్లో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News July 5, 2025
విశాఖలో బాలికపై అత్యాచారయత్నం

రణస్థలం ప్రాంతానికి చెందిన పిన్నింటి చంద్రశేఖర్ (26) డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ రేసపువానిపాలెం వినాయకనగర్ వద్ద నివాసం ఉంటున్నాడు. తన ఇంటి కింద నివసిస్తున్న ఏడో తరగతి చదువుతున్న బాలికను గదికి రప్పించి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని రిమాండ్‌కి తరలించారు.