News December 6, 2025
జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పోస్టులకు అప్లై చేశారా?

ముంబైలోని జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 20 ఆక్చువేరియల్ అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు IAI/IFoA నిర్వహించే పరీక్షలో కనీసం 2 యాక్చురియల్ సబ్జెక్టులలో ఉత్తీర్ణులై ఉండాలి. 21 నుంచి 27ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఇంటర్వ్యూ/గ్రూప్ డిస్కషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి నెలకు రూ.40వేలు స్టైపెండ్ చెల్లిస్తారు.
Similar News
News April 14, 2026
సీట్లు పెంచకుండా డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లు అమలు చేయండి: CM

TG: లోక్‌సభ సీట్ల పెంపుపై అభ్యంతరం తెలుపుతూ సీఎం రేవంత్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. నియోజకవర్గాల పెంపు విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా జాతీయ స్థాయిలో విస్తృత చర్చలు జరపాలని సూచించారు. ఇందుకోసం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. మహిళా రిజర్వేషన్లను డీలిమిటేషన్‌తో ముడిపెట్టవద్దని తెలిపారు. లోక్‌సభ సీట్లు పెంచకుండా డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తే సపోర్ట్ చేస్తామన్నారు.
News April 14, 2026
కోర్టుల్లో బెంచ్‌ల గురించి తెలుసా?

సుప్రీంకోర్టులో డివిజన్ బెంచ్, కాన్‌స్టిట్యూషన్ బెంచ్, లార్జర్ బెంచ్, త్రీ జడ్జి బెంచ్‌లు ఉంటాయి. డివిజన్ బెంచ్‌లో ఇద్దరు న్యాయమూర్తులు ఉంటారు. స్పెషల్ లీవ్ పిటిషన్లు, సివిల్, క్రిమినల్ అప్పీళ్లను విచారిస్తారు. కాన్‌స్టిట్యూషన్ బెంచ్‌లో కనీసం ఐదుగురు జడ్జిలు ఉంటారు. ఇది శాశ్వతం కాదు. కేసు తీవ్రతను బట్టి CJI ఏర్పాటు చేస్తారు. హైకోర్టుల్లో సింగిల్, డివిజన్, ఫుల్, లార్జర్ బెంచ్‌లు ఉంటాయి.
News April 14, 2026
T20 కెప్టెన్‌గా సూర్య కొనసాగుతారా?

భారత T20 కెప్టెన్‌గా సూర్య ఎప్పటివరకు కొనసాగుతారనేది ఆసక్తికరంగా మారింది. ఇటీవల ఆయన కెప్టెన్సీలోనే భారత్ T20 WC గెలిచింది. కానీ బ్యాటింగ్‌లో ఆయన తడబడ్డారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూన్, జులైలో ENG, IREతో జరిగే T20 సిరీస్‌లలో ఆయన ఎలా ఆడతారనే దానిపైనే ఫ్యూచర్ ఆధారపడి ఉందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సిరీస్‌లలో రాణిస్తే ఆయన 2028 ఒలింపిక్స్ వరకూ కెప్టెన్‌గా కొనసాగే అవకాశముందని అంటున్నారు.


