News December 23, 2025

జనవరిలో వైద్యాధికారుల పోస్టుల భర్తీ: రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రెటరీ

image

రాష్ట్రవ్యాప్తంగా కొన్ని జిల్లా ఆసుపత్రులు, వైద్య విధానం పరిషత్ పరిధిలో ఉన్న ఆసుపత్రులలో ఖాళీగా ఉన్న వైద్య పోస్టులను జనవరి నెలలో భర్తీ చేస్తామని వైద్య, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సౌరబ్ గౌర్ చెప్పారు. మంగళవారం నక్కపల్లి ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 230 వైద్యాధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, జనవరి నెలలో వీటిని భర్తీ చేస్తామని చెప్పారు.

Similar News

News December 24, 2025

నెల్లూరు: మరింత వేగంగా విజయవాడకు.!

image

విజయవాడ-గూడూరు మధ్య నాలుగో రైల్వే లైన్‌కు అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ దారిలో 280కి.మీ మేర మూడో ట్రాక్ నిర్మాణం పూర్తి కావొచ్చింది. సరకు రవాణాతోపాటు హై స్పీడ్ రైళ్ల రాకపోకల కోసం కేంద్రం నాలుగో లైన్‌ ఏర్పాటుకు సన్నాహకాలు చేస్తోన్నట్లు సమాచారం. ఇది పూర్తి అయితే VJD-GDR మధ్య రవాణా సమయం మరింత తగ్గనుంది. కావలి, కోవూరు, నెల్లూరు, సర్వేపల్లి, గూడూరు నియోజకవర్గాల మీదుగా ఈ నిర్మాణం జరగనుంది.

News December 24, 2025

‘యూరియా’ యాప్ సక్సెస్: మంత్రి

image

TG: రైతులు ఇంటి నుంచే యూరియా బుక్ చేసుకునేలా ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్ విజయవంతంగా అమలవుతోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రస్తుతం ADB, జనగామ, MBNR, NLG, PDPL జిల్లాల్లో ఈ యాప్ అమలవుతుండగా ఇప్పటివరకు 60,000+ బస్తాలు బుక్ అయినట్లు తెలిపారు. యాప్‌ను మరికొన్ని రోజులు పరిశీలించి రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తెస్తామన్నారు. ఇప్పటికే 5.30లక్షల టన్నుల యూరియా రాష్ట్రానికి వచ్చిందని చెప్పారు.

News December 24, 2025

‘పల్నాడు ఉత్సవ్‌ను అధికారికంగా నిర్వహించాలి’

image

పల్నాడు చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలను గుర్తిస్తూ పల్నాడు ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లాల పునర్విభజనలో భాగంగా ప్రభుత్వం ఏప్రిల్ 4న 2022లో పల్నాడు జిల్లాను ఏర్పాటు చేసింది. అమరావతి, విజయవాడ, ఆవకాయ్ ఉత్సవాలను ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో పల్నాటి చరిత్ర భావితరాలకు తెలిసే విధంగా పల్నాటి ఉత్సవ్ ను అధికారికంగా నిర్వహించాలనేది జిల్లా ప్రజల కోరిక.