News November 12, 2024

జనవరి నాటికి జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు: కొలుసు

image

రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులందరికీ జనవరి 2025 నాటికి అక్రెడిటేషన్లు ఇవ్వనున్నట్లు మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా పేర్కొన్నారు. నివేశన స్థలాలు, గృహ నిర్మాణాలను కూడా ప్రభుత్వమే చేపట్టే విధంగా ఆలోచిస్తున్నామన్నారు. అక్రెడిటేషన్ కమిటీలు యూనియన్ నేతలకు చాన్సు ఉంటుందన్నారు.

Similar News

News November 21, 2024

కృష్ణా: బీఈడీ పరీక్షల రివైజ్డ్ టైం టేబుల్ విడుదల 

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలలో బీఈడీ, బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్ థియరీ పరీక్షల రివైజ్డ్ టైం టేబుల్ గురువారం విడుదలైంది. డిసెంబర్ 6,7,9, 10న బీఈడీ, డిసెంబర్ 6,7, 9,10,11,12న బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తామని KRU పరీక్షల విభాగం తెలిపింది. సబ్జెక్టు వారీగా టైం టేబుల్ వివరాలకై https://kru.ac.in/ చూడాలని కోరింది. 

News November 21, 2024

విజయవాడలో పోగొట్టుకున్న ఫోన్ అప్పగింత 

image

విజయవాడ పటమట పోలీసులు పనితీరుపై ప్రజలు ప్రశంసించారు. విజయవాడ మహానాడు రోడ్‌లో ఓ బ్యాంక్‌లో పీఓగా పనిచేస్తున్న కిషోర్ అనే వ్యక్తి తన ఫోన్ ఈనెల 1వ తేదీన పోగొట్టుకున్నాడు. ఈ క్రమంలో బాధితుడు పటమట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా సాంకేతిక సాయంతో ఫోన్ గుర్తించి బాధితుడికి గురువారం అందజేసినట్లు సీఐ పవన్ కిషోర్ తెలిపారు. ఫోన్లు పోతే ఎవరు నిరుత్సాహానికి గురవ్వాల్సిన అవసరం లేదని సీఐ అన్నారు. 

News November 21, 2024

కృష్ణా: విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల ఫలితాలు విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలో ఇటీవల నిర్వహించిన ఫార్మ్‌డీ కోర్సు 2, 3, 4వ ఏడాది పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఆయా పరీక్షలు రాసిన విద్యార్థులు రిజల్ట్స్ చెక్ చేసుకోవాలని కృష్ణా యూనివర్సిటీ అధ్యాపక వర్గాలు సూచించాయి. ఈ పరీక్షల ఫలితాలకై యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.in/ చూడాలని విద్యార్థులకు ఈ మేరకు ఒక ప్రకటనలో సూచించాయి.