News December 17, 2025
జనవరి నుంచి ‘ఈ-ఆఫీస్’ విధానం: జేసీ

ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకత, వేగం కోసం జనవరి నుంచి పూర్తిస్థాయిలో ‘ఈ-ఆఫీస్’ విధానం అమల్లోకి రానుందని జాయింట్ కలెక్టర్ నిశాంతి తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన అధికారుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇకపై అన్ని ప్రభుత్వ కార్యకలాపాలు ఆన్‌లైన్ ద్వారానే సాగుతాయన్నారు. అధికారులు, సిబ్బంది ఈ సాఫ్ట్‌వేర్ నిర్వహణపై పూర్తి అవగాహన పెంచుకోవాలని సూచించారు.
Similar News
News December 18, 2025
భీమేశ్వరాలయంలో ఆశీర్వచన వేదిక ఏర్పాటు

వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి అనుబంధ దేవాలయమైన భీమేశ్వరాలయంలో ఆశీర్వచన వేదికను ఏర్పాటు చేశారు. ప్రముఖులు, VVIPలు, ఉన్నతాధికారులు స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఆలయ అర్చకులు వీరికి ఇక్కడే వేదొక్త ఆశీర్వచనం అందిస్తుంటారు. ఆలయంలో ఆశీర్వచన వేదిక లేకపోవడంతో దీనిని ఏర్పాటు చేశారు. కాగా శ్రీ రాజరాజేశ్వరి స్వామి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా భీమేశ్వర స్వామివారి దర్శనాలు కల్పిస్తున్న విషయం తెలిసిందే.
News December 18, 2025
రంగాపూర్ గ్రామపంచాయతీ ఎన్నికల్లో వినూత్న నిర్ణయం

హుజూరాబాద్(M) రంగాపూర్‌లో GP ఎన్నికల సందర్భంగా గ్రామపెద్దలు ఎన్నికలకు ఒకరోజు ముందు సమావేశమై అందరికీ కనువిప్పు కలిగే నిర్ణయం తీసుకున్నారు. బరిలో ఉన్న ఇద్దరు సర్పంచ్ అభ్యర్థులు రూ.20లక్షలు డిపాజిట్ చేసి, ఎలాంటి మందు, నగదు పంపిణీ చేయకుండా నిర్ణయం తీసుకున్నారు. గెలిచిన అభ్యర్థి రూ.20లక్షలు గ్రామాభివృద్ధికి కేటాయించి, రూ.3 లక్షలు ఓడిన అభ్యర్థికి ఇవ్వాలని సూచించారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
News December 18, 2025
NLG: ఆ మూడు స్థానాల్లో ఎన్నికలు ఎప్పుడో!

ఉమ్మడి జిల్లాలో మూడు విడతల్లో గ్రామ పంచాయతీల ఎన్నికలను ఎన్నికల సంఘం విజయవంతంగా నిర్వహించింది. అయితే, అనుముల మండలం పేరూరు, మాడుగులపల్లి మండలం అభంగాపురంలో సర్పంచి అభ్యర్థుల్లేక సర్పంచ్ స్థానాలకు, అదే మండలంలోని ఇందుగులలో న్యాయ వివాదంతో సర్పంచ్ సహా వార్డుల సభ్యుల స్థానాల ఎన్నికలు పూర్తిగా ఆగిపోయాయి. దీంతో ఉమ్మడి జిల్లాలో 1,782 పంచాయతీలకు గాను 1,779 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు.


