News December 24, 2025
జనవరి నుంచి చిత్తూరు మరింత చిన్నదాయే.!

జనవరి ఫస్ట్ వీక్‌లో మదనపల్లె జిల్లాను ప్రారంభించే అవకాశం ఉంది. CTR, అన్నమయ్య జిల్లాల పునర్విభజనపై అభ్యంతరాల కోసం కలెక్టర్లు నోటిఫికేషన్ జారీ చేయగా ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదట. దీంతో మదనపల్లె జిల్లా ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లెతోపాటూ పుంగనూరు నియోజకవర్గాల్లోని 19 మండలాలతో కొత్త జిల్లా ఏర్పడనుంది. చిత్తూరు జిల్లా 32 మండలాల నుంచి 28కి పరిమితం కానుంది.
Similar News
News December 25, 2025
చిత్తూరు జిల్లాలో 94.12% పల్స్ పోలియో వ్యాక్సిన్ పూర్తి

చిత్తూరు జిల్లాలో 94.12% పల్స్ పోలియో పూర్తి చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. జిల్లాలో 2,22,502 మంది ఐదేళ్లలోపు చిన్నారులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆదివారం, సోమ, మంగళవారాల్లో ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేశారు. మంగళవారం ఈ కార్యక్రమం పూర్తవ్వగా జిల్లా వ్యాప్తంగా 2,08,470 మందికి పోలియో చుక్కలు వేశారు.
News December 24, 2025
చట్టాల గురించి తెలుసుకోండి: చిత్తూరు ఎస్పీ

చిత్తూరు జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో ఎస్సీటీ పీసీలకు జరుగుతున్న శిక్షణను ఎస్పీ తుషార్ డూడీ బుధవారం పరిశీలించారు. వారి శిక్షణ అభిప్రాయాలను తెలుసుకున్నారు. సిలబస్ అమలుపై అధికారులకు సూచనలు ఇచ్చారు. శిక్షణను సద్వినియోగం చేసుకొని శారీరక దారుఢ్యం, మానసిక స్థైర్యం, చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.
News December 24, 2025
మంచి విలువలు పాటించాలి: చిత్తూరు SP

క్రిస్మస్ పండగ ప్రేమ, కరుణ, సహనం, పరస్పర గౌరవానికి ప్రతీక అని చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ చెప్పారు. సమాజంలో శాంతి నెలకొనడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మంచి విలువలను పాటించాలని పిలుపునిచ్చారు. క్రిస్మస్ ప్రతి కుటుంబానికి ఆనందం, ఆరోగ్యం, సుఖశాంతులు అందించాలని, అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు.


