News December 27, 2025
జనవరి 10న PSLV-C62 ప్రయోగం

AP: PSLV-C62 రాకెట్ ప్రయోగానికి శ్రీహరికోటలోని SDSC సిద్ధమవుతోంది. ఈ రాకెట్ ద్వారా EOS-N1 ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపనున్నారు. వ్యవసాయం, భూ పరిశీలన, నీటి వనరుల పర్యవేక్షణ తదితరాలను ఉద్దేశించి ఇస్రో ఈ ప్రయోగం చేస్తోంది. దీంతో పాటు ఓ వర్సిటీ రూపొందించిన శాటిలైట్, అమెరికాకు చెందిన ఓ చిన్న ఉపగ్రహాన్ని కూడా నింగిలోకి పంపనున్నారు. ఇటీవల ఇస్రో చేపట్టిన బ్లూబర్డ్ ప్రయోగం సక్సెస్ అయిన విషయం తెలిసిందే.
Similar News
News December 27, 2025
ఉల్లి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ

AP: ఈ ఏడాది సరైన ధరలు లేక, వాతావరణం అనుకూలించక ఉల్లి రైతులకు భారీ నష్టాలు మిగిలాయి. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా నిలిచింది. అర్హులైన వారికి పరిహారం అందిచేందుకు రూ.128 కోట్లు విడుదల చేసింది. హెక్టారుకు రూ.20 వేల చొప్పున ఈ సాయం అందించనుంది. ఈ-క్రాప్ ఐడీ ఆధారంగా రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కర్నూలు, కడప జిల్లాల్లో ఇప్పటికే 37,752మంది రైతులకు పరిహారం అందజేశారు.
News December 27, 2025
జనరేషన్ బీటా గురించి తెలుసా?

2025 జనవరి 1 నుంచి 2039 డిసెంబర్ 31 వరకు పుట్టే పిల్లలందరినీ ‘జనరేషన్ బీటా’గా పిలుస్తారు. ఈ తరం పూర్తిగా AI ప్రపంచంలో పెరగనుంది. భారత్‌లో మొదటి బీటా బేబీ మిజోరంలో పుట్టింది. ఇలా జనరేషన్స్‌కు పేర్లు పెట్టడం 1901లో ప్రారంభమైంది. జనరేషన్ బీటాకు ముందు జనరేషన్ X (1965-80), జనరేషన్ Y లేదా మిలీనియల్స్(1981-1996), జనరేషన్ Z (1997-2009), జనరేషన్ ఆల్ఫా (2010-2024)లు ఉన్నాయి. ఇంతకీ మీరు ఏ జనరేషన్?
News December 27, 2025
పబ్లిక్ ప్లేస్‌లో పావురాలకు మేత వేస్తున్నారా?

చాలామంది రోడ్లమీద, పార్కుల్లో పావురాలకు మేత వేస్తూ ఉంటారు. వాటి వల్ల అనారోగ్య <<15060184>>సమస్యలు<<>> వస్తాయని చెప్పినా లెక్కచేయరు. అయితే అలా చేసిన ఓ వ్యాపారికి ముంబై కోర్టు రూ.5వేలు ఫైన్ వేసింది. అతను చేసిన పనిని హ్యూమన్ లైఫ్, హెల్త్‌కి ముప్పుగా, ప్రాణాంతక ఇన్‌ఫెక్షన్ స్ప్రెడ్ చేసే చర్యగా పేర్కొంది. పావురాలతో మనకు ఎంత ప్రమాదం పొంచి ఉందో ఈ వ్యాఖ్యలను బట్టి అర్థం చేసుకోవచ్చని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


