News December 21, 2025

జనవరి 10 నుంచి టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలు

image

జిల్లాలో టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలు జనవరి 1నుంచి 13 వరకు నిర్వహించనున్నట్లు DEO అశోక్ తెలిపారు. డ్రాయింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ అభ్యర్థులకు ఈ పరీక్షలు జరుగుతాయి. ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తామన్నారు. టైలరింగ్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ సొంత కుట్టు మిషన్లను తెచ్చుకోవాలన్నారు. అభ్యర్థులందరూ నిర్ణీత సమయానికి ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలన్నారు.

Similar News

News December 27, 2025

బిందుసేద్యంతో నీటి వృథా తగ్గి, పంట దిగుబడి పెరుగుతుంది

image

బిందుసేద్యంతో సాగునీటివృథాను అరికట్టడమే కాకుండా నీటిని నేరుగా మొక్క వేర్లు ఉండే ప్రాంతానికి సరఫరా చేయవచ్చు. దీని వల్ల 30-50% నీటిని ఆదా చేయవచ్చు. అతి తేలికైన, ఇసుక, బరువైన నల్లరేగడి నేలలు, లోతు తక్కువ, ఎత్తు పల్లాలుగా ఉండే భూమి, చదును చేయుటకు వీలు లేని భూములు కూడా బిందు సేద్యానికి అనుకూలం. బిందు సేద్యంతో సరైన తేమ, సమపాళ్లలో పోషక పదార్థాలు అందడం వల్ల మొక్కలు వేగంగా పెరిగి, అధిక దిగుబడులు వస్తాయి.

News December 27, 2025

NZB: 129 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు: ఇన్‌ఛార్జ్ CP

image

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వారం రోజుల్లో 129 డ్రంక్ అండ్ డ్రైవ్‌ కేసులు నమోదైనట్లు ఇన్‌ఛార్జ్ పోలీస్ కమిషనర్ రాజేశ్ చంద్ర తెలిపారు. వీరందరినీ కోర్టులో హాజరు పరిచినట్లు చెప్పారు. న్యాయమూర్తి 129 మందికి రూ.8.80 లక్షల జరిమానా వేసినట్లు పేర్కొన్నారు. అలాగే 10 మందికి వారం రోజుల చొప్పున జైలు శిక్ష విధించారని వెల్లడించారు.

News December 27, 2025

‘ఆస్తి, ఖాళీ స్థలాల పన్నులను జీవీఎంసీ వెబ్ పోర్టల్ నందు చెల్లించండి’

image

జీవీఎంసీ పరిధిలో ఇంటి పన్ను, ఖాళీ స్థలాల పన్ను, నీటి పన్ను జీవీఎంసీ యొక్క www. gvmc.gov.in వెబ్సైట్ నందు సులభంగా చేసుకోవచ్చని జీవీఎంసీ అదనపు కమిషనర్ డి.వి.రమణమూర్తి శనివారం తెలిపారు. ఈ పోర్టల్ ద్వారా క్రెడిట్, డెబిట్, నెట్ బ్యాంకింగ్, UPI ద్వారా చెల్లించుకోవచ్చు అన్నారు. ఆస్తిపన్ను చెల్లింపుదారులు ఈ సౌకర్యాలను ఉపయోగించుకొని విలువైన సమయం వృథా కాకుండా పన్నులు చెల్లింపు చేయవచ్చు పేర్కొన్నారు.