News January 12, 2026

జనవరి 12: చరిత్రలో ఈ రోజు

image

1863: తత్వవేత్త స్వామి వివేకానంద జననం
1895: యల్లాప్రగడ సుబ్బారావు జననం
1962: రిచీ రిచర్డ్‌సన్ జననం
1991: హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ జననం
1991: చెస్ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక జననం
2005: సినీ నటుడు అమ్రీష్ పురి మరణం
2015: సినీ నిర్మాత, దర్శకుడు వి.బి.రాజేంద్రప్రసాద్ మరణం
* జాతీయ యువజన దినోత్సవం

Similar News

News February 18, 2026

15 గంటలు రోడ్లపైనే తిరిగారు.. పాక్ పరువు పోయిందిగా!

image

హాకీ ప్రో లీగ్ కోసం ఇటీవల ఆస్ట్రేలియా వెళ్లిన పాకిస్థాన్ హాకీ ఆటగాళ్లకు చేదు అనుభవం ఎదురైంది. మేనేజ్మెంట్ హోటల్ రూమ్స్‌కు డబ్బులు చెల్లించకపోవడంతో వేరే బస కోసం 12-15 గంటలు సిడ్నీ వీధుల్లోనే తిరిగారు. చివరికి సొంతఖర్చులతో రూమ్ తీసుకున్నారు. ఫుడ్ కోసమూ ఇబ్బందులు పడ్డారు. ఇండియా ముందు పాక్ పరువు పోకూడదని యాజమాన్యం ఒత్తిడి చేయడంతో మొదట ఖండించానని.. కానీ అదంతా నిజమేనని కెప్టెన్ షకీల్ భట్ వెల్లడించారు.

News February 18, 2026

‘నేను ఇండియాకు రాలేను’.. బాంబే హైకోర్టుకు తెలిపిన విజయ్ మాల్యా!

image

తాను భారత్‌కు తిరిగి రాలేనని పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడు విజయ్ మాల్యా బాంబే హైకోర్టుకు తెలిపారు. తన వద్ద యాక్టివ్ పాస్‌పోర్టు లేదని, పైగా బ్రిటన్ విడిచి వెళ్లకుండా అక్కడి కోర్టుల ఆంక్షలు ఉన్నాయని ఆయన తరఫు లాయర్ అమిత్ దేశాయ్ తెలిపారు. భారత్‌కు రానంత వరకు మాల్యా పిటిషన్లను విచారించబోమని చీఫ్ జస్టిస్ శ్రీ చంద్రశేఖర్ నేతృత్వంలోని ధర్మాసనం గతవారం స్పష్టం చేయడంతో ఆయన ఈ వివరణ ఇచ్చారు.

News February 18, 2026

అజిత్ పవార్ దుర్మరణం రోజే 75 ఫైళ్లు క్లియర్.. ఎలా సాధ్యం?

image

జనవరి 28న అజిత్ పవార్ విమాన ప్రమాద వార్తతో మహారాష్ట్ర మొత్తం షాక్‌లో ఉంటే ఆ రాష్ట్ర మైనారిటీ శాఖ మాత్రం అదే రోజు ఏకంగా 75 స్కూల్ ఫైళ్లను క్లియర్ చేసేసింది. ఒక్క రోజులోనే ఇన్ని ఫైళ్లపై సంతకాలు ఎలా చేశారంటూ విపక్షాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఈ రచ్చ ముదరడంతో డిప్యూటీ సెక్రటరీ మిలింద్ షెనాయ్‌పై బదిలీ వేటు పడింది. దీని వెనక ఏదో మతలబు ఉందన్న ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.