News January 13, 2026
జనవరి 13: చరిత్రలో ఈరోజు

✯1948: హిందూ, ముస్లిముల సమైక్యత కోరుతూ గాంధీజీ తన చిట్టచివరి నిరాహారదీక్ష చేపట్టారు
✯1879: లయన్స్ క్లబ్ వ్యవస్థాపకుడు మెల్విన్ జోన్స్ జననం
✯1919: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి జననం
✯1949: అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయుడు రాకేష్ శర్మ జననం
✯1995: సినీ నటుడు వైష్ణవ్ తేజ్ జననం
✯2014: తెలుగు సినిమా నటి అంజలీదేవి మరణం
Similar News
News February 12, 2026
అందుకే BRS అధికారం కోల్పోయింది: కవిత

TG: ప్రజాస్వామ్య విలువలను కాలరాయడం వల్లే BRS అధికారం కోల్పోయిందని కవిత అన్నారు. ‘ఉద్యమకారుల ఆకాంక్షలను నెరవేర్చనందుకే KCR అధికారం కోల్పోయారు. రేవంత్ పట్టించుకోకపోతే ఆయననూ ప్రజలు వదిలిపెట్టరు’ అని హెచ్చరించారు. రాజకీయ పార్టీ పెడతానంటే తనపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడానికి తెలంగాణ పదం ఉండేలా పార్టీ పెడతానని ఉద్యమకారుల ఆత్మగౌరవ సభలో వ్యాఖ్యానించారు.
News February 12, 2026
తేమ అవసరం.. అతి తేమతో పంటకు ప్రమాదం

పంట ఎదుగుదలకు నేలలో తగినంత తేమ అవసరం. అయితే పరిమితికి మించి తేమ, నీరు నిల్వ ఉంటే మాత్రం నేలలో గాలి ప్రసరణ తగ్గి, వేర్లకు ఆక్సిజన్ అందక శ్వాసప్రక్రియ మందగిస్తుంది. దీని వల్ల వేర్లు కుళ్లి, తెగుళ్లు ఆశించి మొక్క ఎదుగుదల నిలిచిపోయి పంట దిగుబడి తగ్గుతుంది. తేమ మరీ ఎక్కువైతే మొక్కలు చనిపోతాయి. టమాటా, మిర్చి, వంకాయ, కీరదోస, బత్తాయి, ద్రాక్షల్లో అధిక తేమతో వేరుకుళ్లు సహా ఇతర సమస్యల ముప్పు పెరుగుతుంది.
News February 12, 2026
శివ నామాలు అర్థాలు ‘‘త్రిపురారి’’

తారకాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మాలి అనే ముగ్గురు రాక్షసులు బ్రహ్మ వరం పొంది బంగారం, వెండి, ఇనుముతో కూడిన 3 నగరాలను నిర్మించుకున్నారు. వారు లోకాలను హింసిస్తుండగా, దేవతల ప్రార్థన మన్నించిన శివుడు యుద్ధానికి సిద్ధమయ్యాడు. భూమినే రథంగా, వేదాలను గుర్రాలుగా చేసుకుని, ఒకే బాణంతో ఆ 3 పురాలను భస్మం చేసి రాక్షస సంహారం చేశాడు. ఆ 3 పురాలను(త్రిపుర) అంతం చేసిన శత్రువు(అరి) కాబట్టి ఆయన ‘త్రిపురారి’ అయ్యాడు.


