News December 25, 2025
జనవరి 2 నుంచి 9 వరకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ : కలెక్టర్

రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్ ఆదేశాల మేరకు, తిరిగి సర్వే చేయబడిన గ్రామాల్లో కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలను 2026 జనవరి 2 నుంచి 9 వరకు పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు కలెక్టర్ జి.రాజకుమారి తెలిపారు. పంపిణీ ప్రక్రియలో వెబ్‌ల్యాండ్ రికార్డులతో ముద్రిత పాస్ పుస్తకాలను పూర్తిగా క్రాస్ చెక్ చేయాన్నారు. సంబంధిత పట్టాదారుల బయోమెట్రిక్ ధృవీకరణ ద్వారా మాత్రమే పాసు పుస్తకాలు అందజేయాలన్నారు.
Similar News
News December 26, 2025
రెడ్ కలర్ చూస్తే ఎద్దులు దాడి చేస్తాయా! నిజమేంటి?

రెడ్ కలర్ ఎద్దులకు నచ్చదని, దాడి చేస్తాయనేది అపోహ మాత్రమే. చాలా పశువుల్లాగే ఎద్దులకు కూడా రెడ్ కలర్‌ను గుర్తించే రెటీనా సెల్స్ ఉండవు. ఎద్దులు డైక్రోమాట్స్ (2కలర్ రిసెప్టర్లు) కావడంతో ఎల్లో, బ్లూ, గ్రీన్, వయొలెట్ రంగులను గుర్తించగలవు. వాటికి ఎరుపు రంగు గ్రేయిష్-బ్రౌన్ లేదా ఎల్లోయిష్-గ్రేలా కనిపిస్తుంది. వేగమైన కదలికల కారణంగా దాడికి దిగుతాయి. తెలుపు, నీలం రంగు క్లాత్స్ కదిలించినా దాడి చేస్తాయి.
News December 26, 2025
GHMC: కొత్త జోనల్ కమిషనర్లు వీళ్లే

*శేరిలింగంపల్లి: భోర్ఖడే హేమంత్ సహదేవ్‌రావు
* కూకట్‌పల్లి: అపూర్వ్ చౌహాన్
* కుత్బుల్లాపూర్: సందీప్ కుమార్ ఝా
* చార్మినార్: ఎస్. శ్రీనివాస్ రెడ్డి
* గోల్కొండ: జి. ముకుంద రెడ్డి
* ఖైరతాబాద్: ప్రియాంక అలా
* రాజేంద్రనగర్: అనురాగ్ జయంతి
* సికింద్రాబాద్: ఎన్. రవి కిరణ్
* శంషాబాద్: కె. చంద్రకళ
* ఎల్.బి.నగర్: హేమంత కేశవ్ పాటిల్
* మల్కాజ్‌గిరి: సంచిత్ గంగ్వార్
* ఉప్పల్: రాధికా గుప్తా
News December 26, 2025
డిసెంబర్ 26: చరిత్రలో ఈరోజు

✒ 1899: స్వాతంత్ర్య సమరయోధుడు ఉద్దమ్ సింగ్ జననం
✒ 1893: చైనాలో ప్రముఖ కమ్యూనిస్టు నేత మావో జెడాంగ్ జననం
✒ 1946: దర్శకుడు బి.నరసింగరావు జననం
✒ 1981: మహానటి సావిత్రి మరణం(ఫొటోలో)
✒ 1988: కాపు నేత వంగవీటి మోహనరంగా మరణం
✒ 2004: పలు దేశాల్లో విధ్వంసం సృష్టించిన సునామీ. దాదాపు 2,75,000 మంది మృతి


