News December 10, 2025

జనవరి 25న కోనసీమలో మాదిగ ఆత్మీయ సమ్మేళనం

image

కోనసీమ జిల్లా స్థాయి మాదిగ ఆత్మీయ సమ్మేళనానికి ప్రతి ఒక్కరూ తరలిరావాలని జిల్లా ఉపాధ్యక్షులు కె.రాఘవ పిలుపునిచ్చారు. జనవరి 25న జరగనున్న ఈ సభకు ముఖ్య అతిథిగా పద్మశ్రీ కృష్ణ మాదిగ పాల్గొననున్నారు. ఈ సమావేశంలో మాదిగ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొని సభను ఘనంగా నిర్వహించుకోవాలన్నారు. ఈ సమ్మేళనం మాదిగ జాతి ఐక్యత, సంక్షేమం, సామాజిక, ఆర్థిక పురోగతికి దోహదపడుతుందని ఆయన తెలిపారు.

Similar News

News December 11, 2025

NZB: మొదటి రెండు గంటల్లో 19.80 శాతం పోలింగ్

image

తొలి దశ ఎన్నికల్లో ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు 164 GPల్లో నమోదైన పోలింగ్ శాతం మండలాల వారీగా ఇలా
బోధన్ మండలంలో 26.26%,
చందూరు-16.63%
కోటగిరి- 17.76%
మోస్రా-15.42%
పోతంగల్- 19.76%
రెంజల్- 23.99%
రుద్రూరు-10.38%
సాలూర- 24.30%
వర్ని-19.62%
ఎడపల్లి-20.48%
నవీపేట -17.07% పోలింగ్ నమోదైనట్లు అధికారులు వివరించారు.

News December 11, 2025

పోలింగ్ సరళిని పరిశీలిస్తున్న నాగర్ కర్నూల్ కలెక్టర్

image

నాగర్ కర్నూల్ జిల్లాలో జరుగుతున్న మొదటి విడత పంచాయతీ ఎన్నికల సరళిని కలెక్టర్ బధావత్ సంతోష్ పరిశీలిస్తున్నారు. కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్‌తో కలిసి వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. ఆరు మండలాల పరిధిలోని అన్ని గ్రామాల్లో కొనసాగుతున్న ఓటింగ్ వివరాలను అడిగి తెలుసుకున్నారు.

News December 11, 2025

కామారెడ్డి జిల్లాలో 19.70 పోలింగ్ నమోదు

image

కామారెడ్డి జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 19.70 శాతం పోలింగ్ నమోదైంది. భిక్కనూర్ 21.22 శాతం, బిబిపేట్ 7.36, దోమకొండ 19.14, కామారెడ్డి, 23.66 మాచారెడ్డి 19.46, పల్వంచ 20.49 రాజంపేట్ 21.02 రామారెడ్డి 22.61, సదాశివనగర్ 20.96, తాడ్వాయి 18.76 శాతం పోలింగ్ నమోదైంది.