News January 29, 2026
జనవరి 29: చరిత్రలో ఈరోజు

1912: సుప్రీంకోర్టు 14వ ప్రధాన న్యాయమూర్తి అజిత్ నాథ్ రే జననం
1936: సినీ గేయ రచయిత వేటూరి సుందరరామ్మూర్తి జననం (ఫొటోలో)
1936: సినీ దర్శకుడు బైరిశెట్టి భాస్కరరావు జననం
1962: జర్నలిస్టు, ఉద్యమకారిణి గౌరీ లంకేష్ జననం
2003: నటి పండరీబాయి మరణం
* జాతీయ పజిల్ దినోత్సవం
Similar News
News February 16, 2026
మంత్రులతో సీఎం రేవంత్ జూమ్ మీటింగ్

TG: కార్పొరేషన్ మేయర్లు, మున్సిపాలిటీల ఛైర్మన్ల ఎన్నికపై సీఎం రేవంత్ మంత్రులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. రేపు వీరి ఎన్నిక సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. హంగ్ ఏర్పడిన చోట ఏ ఒక్కటి చేజారనీయొద్దని నేతలకు దిశానిర్దేశం చేశారు. మీటింగ్‌లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి తదితరులు పాల్గొన్నారు.
News February 15, 2026
పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్

T20WC: ICC ఈవెంట్లలో పాక్‌పై భారత్ జైత్రయాత్రను కొనసాగించింది. ఫార్మాట్ ఏదైనా, ప్లేస్ మారినా ఫలితం మారదని నిరూపించింది. కొలంబోలో జరిగిన మ్యాచ్‌లో దాయాదిని 61 పరుగుల తేడాతో చిత్తు చేసింది. 176 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన పాక్‌ను 18 ఓవర్లలో 114 రన్స్‌కే కట్టడి చేసింది. బుమ్రా, అక్షర్, వరుణ్, హార్దిక్ తలో 2 వికెట్లు, కుల్దీప్, తిలక్ చెరో వికెట్ తీశారు. వరుసగా 3 విజయాలతో IND సూపర్-8కి చేరుకుంది.
News February 15, 2026
38 దేశాలతో ట్రేడ్ డీల్స్.. MSMEల మార్కెట్ విస్తరించింది: మోదీ

దేశంలో రాజకీయ స్థిరత్వం పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని పెంచిందని PM మోదీ చెప్పారు. కొన్నేళ్లుగా 38 దేశాలతో 9 ట్రేడ్ డీల్స్ చేసుకున్నట్లు తెలిపారు. టెక్స్‌టైల్స్, లెదర్, కెమికల్స్, హ్యాండ్‌క్రాఫ్ట్స్, జువెల్లరీ వంటి రంగాల్లో MSMEల మార్కెట్ విస్తరించిందన్నారు. ఎగుమతిదారులకు కొత్త అవకాశాలు తెరుచుకున్నాయని పేర్కొన్నారు. UPA హయాంలో ఆర్థిక నిర్వహణ సరిగ్గా లేక ఏ దేశంతోనూ చర్చించలేకపోయిందని విమర్శించారు.


