News December 30, 2025
జనవరి 3న కొండగట్టుకు పవన్ కళ్యాణ్.. షెడ్యూల్ ఇదే!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టు పర్యటన ఖరారైంది. జనవరి 3న ఉ.9:30కి హెలికాప్టర్ ద్వారా HYD నుంచి కొండగట్టు సమీపంలోని జేఎన్‌టీయూకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానాలు నిధులతో నిర్మిస్తున్న 100 గదుల వసతి గృహాల శంకుస్థాపనలో పాల్గొని మధ్యాహ్నం ఒంటి గంటకు హైదరాబాద్‌కు తిరిగి వెళ్తారు.
Similar News
News December 31, 2025
వింటర్‌లో రాత్రుళ్లు చెమటలా? షుగర్ ముప్పు!

చలికాలంలో కూడా రాత్రుళ్లు చెమటలు పడుతుంటే నిర్లక్ష్యం చేయవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. షుగర్ వచ్చిందనడానికి అది సంకేతం కావొచ్చని చెబుతున్నారు. ఎక్కువసార్లు మూత్ర విసర్జనకు వెళుతుండడం, నిద్రపోతున్న సమయంలో చేతులు, కాళ్లు జలదరిస్తాయి. అయితే, విటమిన్ B12, నరాల బలహీనత ఉన్నా ఆ సమస్య రావొచ్చని గుర్తుంచుకోండి. షుగర్‌ను నిర్లక్ష్యం చేస్తే మూత్రపిండాల సమస్య, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది.
News December 31, 2025
NZB: విక్రం నాయక్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్

తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ T-20 క్రికెట్ లీగ్ టోర్నమెంట్‌లో నిజామాబాద్ జిల్లా జట్టుకు చెందిన విక్రం నాయక్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. HYDలోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో HYD జట్టును ఓడించడంలో విక్రమ్ తనదైన శైలిలో బ్యాటింగ్ చేశాడు. 33 బంతుల్లో 4 బౌండరీలు, 4 సిక్సర్లతో మొత్తం 61 పరుగులు చేసి జట్టు విజయానికి కృషి చేశాడు. దీంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
News December 31, 2025
ఖమ్మం: పంట రుణాల పరిమితిపై కలెక్టర్ కీలక సమీక్ష

ఖమ్మం డీసీసీబీలో 2026-27 సంవత్సరానికి సంబంధించి పంటలపై రుణ పరిమితి నిర్ణయంపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మంగళవారం సమీక్షించారు. ఎరువులు, విత్తనాలు, యంత్రాలు, ఇతర సాగు ఖర్చులను పరిగణనలోకి తీసుకొని రైతులకు మేలు జరిగేలా చూడాలన్నారు. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల సాగు పరిస్థితులు, పాడి పరిశ్రమకు అనుగుణంగా రైతులకు గరిష్ట ప్రయోజనం చేకూర్చేలా తుది ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.


