News January 8, 2026
జనవరి 8: చరిత్రలో ఈరోజు

* 1642: ప్రముఖ భౌగోళిక శాస్త్రజ్ఞుడు గెలీలియో మరణం. * 1942: భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ జననం * 1962: లియోనార్డో డావిన్సీ వేసిన ‘మోనాలిసా’ పెయింటింగ్‌ను USలో తొలిసారి ప్రదర్శించారు. * 1975: మ్యూజిక్ డైరెక్టర్ హ్యారిస్ జైరాజ్ పుట్టినరోజు * 1983: హీరో తరుణ్ బర్త్‌డే (ఫొటోలో) * 1987: IND మాజీ క్రికెటర్ నానా జోషి మరణం
Similar News
News January 31, 2026
అంబటి రాంబాబుకు ఫోన్ చేసిన YS జగన్

AP: YCP నేత అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడి <<19014952>>ఘటన<<>>పై పార్టీ అధినేత, మాజీ CM వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు. అంబటికి ఫోన్ చేసి పరామర్శించి ధైర్యం చెప్పారు. అదే విధంగా రాష్ట్రం జంగిల్‌రాజ్‌గా మారిందని, చంద్రబాబు ఆటవిక పాలన సాగిస్తున్నారని ట్వీట్ చేశారు. ఉద్దేశపూర్వకంగానే దాడులు, హత్యాయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అంబటికి పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
News January 31, 2026
వారికి 2 రోజులు స్పెషల్ క్యాజువల్ లీవులు

AP: ఫిబ్రవరి 5న ఏపీజేఏసీ రాష్ట్ర మహాసభ కోసం విజయవాడకు వచ్చే ఉద్యోగులకు ప్రభుత్వం రెండు రోజులు స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేసింది. 4, 5వ తేదీల్లో సెలవు ఉండనుంది. సభ కోసం రాష్ట్రంలోని 90 డిపార్ట్‌మెంట్ల ఉద్యోగులకు సెలవు ఇవ్వాలని ఏపీజేఏసీ ఛైర్మన్ బొప్పరాజు విజ్ఞప్తి చేశారు. దీనికి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ జీవో విడుదల చేసింది.
News January 31, 2026
రేపు పాక్‌తో మ్యాచ్.. యువ ఆటగాళ్లకు సచిన్ పాఠాలు!

U19 WCలో భాగంగా రేపు పాక్‌తో సూపర్-6లో యువ భారత్ తలపడనుంది. ఆసియా కప్ ఫైనల్‌లో ఎదురైన <<18632613>>ఓటమి<<>>కి బదులు తీర్చుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో ఒత్తిడిలో ఉన్న ఆటగాళ్లతో క్రికెట్ లెజెండ్ సచిన్ వర్చువల్‌గా మాట్లాడారు. వారికి ఇది అమూల్యమైన అనుభవమని, ముఖ్యమైన అంశాలపై సచిన్ అవగాహన కల్పించారని BCCI తెలిపింది. సూపర్-6 తొలి మ్యాచ్‌లో జింబాబ్వేపై 204 పరుగుల తేడాతో IND గెలిచింది.


