News February 25, 2025

జనసంద్రంగా శ్రీశైలం

image

జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల క్షేత్రం జనసంద్రంగా మారింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందినవారు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. మల్లన్నను దర్శించుకుని సాయంత్రం జరిగే ఉత్సవాలను తిలకించి భక్తులు తరిస్తున్నారు.

Similar News

News February 10, 2026

కొడుకు పెళ్లికి రావాలని మోదీకి సచిన్ ఆహ్వానం

image

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుటుంబంతో PM మోదీని కలిశారు. Mar 5న జరగనున్న కొడుకు అర్జున్ పెళ్లికి ఆయనను ఆహ్వానించినట్లు SMలో సచిన్ తెలిపారు. ‘అర్జున్, సానియా చందోక్ పెళ్లికి మోదీని ఆహ్వానించడం గర్వంగా ఉంది. యంగ్ కపుల్‌ను ఆశీర్వదించి, విలువైన సలహాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. అనంతరం ఢిల్లీ 10 జన్‌పథ్‌లోని నివాసంలో సోనియా గాంధీని కలిసి పెళ్లి వేడుకకు ఆహ్వానించారు.

News February 10, 2026

చిత్తూరు జిల్లాలో విషాదం

image

నెల్లిపట్ల గ్రామ పంచాయతీ కేంద్రంలోని ఎస్టీ కాలనీకి చెందిన యానాది గజేంద్ర (31) ప్రమాదవశాత్తు బావిలోకి దిగి మృతి చెందాడు. ఇదే గ్రామానికి చెందిన మున్నెప్ప వ్యవసాయ బావిలోకి మోటర్ మరమ్మతుకై దిగుతుండగా గజేంద్ర కాలుజారి ప్రమాదవశాత్తు నీళ్లలో పడి మృతి చెందాడు. ఇతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.

News February 10, 2026

కరీంనగర్: పోలింగ్ వేళ.. అభ్యర్థుల్లో ఉత్కంఠ..!

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగియగానే రాజకీయ పోరు కొత్త మలుపు తిరిగింది. బహిరంగ సభలు, ర్యాలీలు ముగియడంతో సమరం ఇళ్ల ముంగిటకు మారింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు డోర్ టూ డోర్ వ్యూహాలు, డిజిటల్ ప్రచారంతో అమలు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా తాయిళాల పంపిణీ ఊపందుకున్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది. పోలింగ్ సమయం దగ్గరపడటంతో అభ్యర్థుల్లో గెలుపోటముల టెన్షన్ పెరుగుతోంది.