News March 19, 2024

జనసేనకు ‘గోదారోళ్ల’ మద్దతు ఉండేనా..?

image

TDP- జనసేన- BJP పొత్తులో భాగంగా APలో జనసేన 21 స్థానాల్లో పోటీచేయనుంది. అయితే ఇప్పటివరకు ప్రకటించిన వారిలో 9మంది ఉభయగోదారి జిల్లాల నుంచే ఉండటం గమనార్హం. మరో 2 స్థానాల్లోనూ పోటీ చేసే అవకాశం ఉందని టాక్. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ సైతం తూ.గో. జిల్లా పిఠాపురం నుంచి బరిలో ఉన్నారు. మొత్తం సీట్లలో 50 శాతం అభ్యర్థులను మన గోదారి జిల్లాల నుంచే బరిలో నిలిపారు. మరి జనసేనను గోదారోళ్లు ఆదరించేనా..? – మీ కామెంట్..?

Similar News

News September 5, 2025

పాలకొల్లు: మహిళ కడుపులో భారీ గడ్డ

image

పోడూరులోని వద్దిపర్రుకు చెందిన కడియం సీతా మహాలక్ష్మి కడుపు నొప్పి, ఉబ్బరంతో గురువారం రాత్రి పాలకొల్లులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికివచ్చారు. వైద్యులు స్కాన్ చేసి కడుపులో గడ్డ ఉందని తెలిపారు. ఆమెకు ఆపరేషన్ చేసి విజయవంతంగా కణతిని బైటకు తీసి ఆమెను కాపాడారు. జనరల్, లాప్రోస్కోపిక్ సర్జన్ డా.లంకలపల్లి గోకుల్ కుమార్, డా. లక్ష్మి వైద్యులను అభినందించారు.

News September 4, 2025

వాహనాలను గూడ్స్ క్యారేజ్ గా మార్చుకోవాలి: కృష్ణారావు

image

మొబైల్ క్యాంటీన్‌గా రిజిస్టర్ అయిన వాహనాలను తక్షణమే గూడ్స్ క్యారేజ్‌గా మార్చుకోవాలని జిల్లా రవాణా అధికారి కృష్ణారావు గురువారం తెలిపారు. జిల్లాలో 334 మొబైల్ క్యాంటీన్ వాహనాలు రిజిస్టర్ అయి ఉన్నాయని, వాటి యజమానులు సోమవారంలోగా తమ వాహన పత్రాలతో రవాణా శాఖ కార్యాలయాలను సంప్రదించాలన్నారు. మొబైల్ క్యాంటీన్ నుంచి గూడ్స్ క్యారేజ్‌గా మార్చుకోవాలని కోరారు.

News September 4, 2025

జిల్లాలో ఎరువుల కొరత లేదు: జేసీ

image

జిల్లాలో ఎరువుల కొరత లేదని, సొసైటీలో అందుబాటులో ఉన్నాయని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం వీరవాసరంలోని శ్రీనివాస ట్రేడర్స్, సాయి లక్ష్మి ఫెర్టిలైజర్స్, వ్యవసాయ సహకార సంఘం గోదాములను ఆకస్మిక తనిఖీ చేశారు. యూరియా నిల్వల‌పై స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. ఎరువుల అమ్మకాలలో ప్రభుత్వ నియమాలను పాటించనిపై వారిపై చర్యలు తప్పవన్నారు.