News January 22, 2026

జనసేనపై కుట్రలు.. అప్రమత్తంగా ఉండాలి: పవన్ కళ్యాణ్

image

AP: జనసేనపై జరుగుతున్న దుష్ప్రచారాలను తీవ్రంగా ఖండించాలని పార్టీ నాయకులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. ‘ఈ మధ్య కాలంలో వ్యక్తుల మధ్య జరుగుతున్న ఘర్షణలు, ఆర్థిక లావాదేవీలు, కుల విభేదాలను జనసేనకు ఆపాదించాలని కొందరు కిరాయి వక్తలు, మాధ్యమాలు కుట్రలు పన్నుతున్నాయి. వివాహేతర సంబంధాల రచ్చను కూడా రుద్దాలని చూస్తున్నాయి. అన్నివేళలా అప్రమత్తంగా ఉండాలి’ అని పవన్ సూచించినట్లు జనసేన ఓ ప్రకటనలో తెలిపింది.

Similar News

News February 21, 2026

17 లక్షల యాప్స్‌పై బ్యాన్!

image

ఆండ్రాయిడ్ యూజర్ల భద్రత కోసం ప్లేస్టోర్ క్లీనింగ్ చర్యలను గూగుల్ చేపట్టింది. ఫేక్, పాలసీలను ఉల్లంఘిస్తున్న 17.5 లక్షల యాప్స్‌ను బ్యాన్ చేసింది. హానికరమైన, ఫేక్ యాప్స్‌కు చెందిన 80 వేల డెవలపర్ అకౌంట్లను బ్లాక్ చేసింది. మరోవైపు 16 కోట్ల స్పామ్ రేటింగ్స్, ఫేక్ ఫీడ్ బ్యాక్స్‌ను డిలీట్ చేసింది. 2.55 లక్షల యాప్స్ అనవసరంగా లొకేషన్, ఫొటోలు, ఇతర వ్యక్తిగత సమాచారం అడగకుండా నిరోధించినట్లు కంపెనీ తెలిపింది.

News February 21, 2026

సూపర్-8 సమరం ఇవాళ్టి నుంచే!

image

T20 WCలో లీగ్ దశ ముగిసింది. ఇవాళ్టి నుంచి సూపర్-8 సమరం మొదలుకానుంది. మొత్తం 8 టీమ్స్‌లో టాప్-4 సెమీ ఫైనల్స్‌కు చేరుకుంటాయి. నేటి రాత్రి 7 గంటలకు కొలంబో వేదికగా న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఇక రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఇంగ్లండ్, శ్రీలంక, రాత్రి 7 గంటలకు ఇండియా, సౌతాఫ్రికా మ్యాచులు జరగనున్నాయి.