News July 25, 2024
జనసేనలోకి కిలారి రోశయ్య.?

పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య బుధవారం వైసీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన రాజకీయ భవిష్యత్తుపై జిల్లాలోని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆయన జనసేనలో చేరే అవకాశం ఉన్నట్లు సమచారం. బుధవారం జరిగిన ఆత్మీయ సమావేశంలోనూ రోశయ్య జనసేనలోకి వెళ్లడం మంచిదని ఆయన అనుచరులు అభిప్రాయపడ్డారు. మరోవైపు జనసేన అగ్రనేతలతో ఆయన ఇప్పటికే టచ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది.
Similar News
News March 7, 2026
గుంటూరు: ఈ నెల 13 నుంచి HPV వ్యాక్సినేషన్

గుంటూరు జిల్లాలో 14 ఏళ్ల బాలికలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు HPV వ్యాక్సినేషన్‌ను మార్చి 13 నుంచి ప్రారంభించనున్నట్లు DMHO విజయలక్ష్మి తెలిపారు. జిల్లాలో 14,167 మంది అర్హులను గుర్తించామని, PHCలు, CHCలు, GGHలలో ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని చెప్పారు. 90 రోజుల పాటు కొనసాగే ఈ కార్యక్రమంలో బాలికలందరికీ టీకా వేయించాలని ఆమె కోరారు.
News March 6, 2026
విచారణ అనంతరం విధుల్లోకి తీసుకుంటాం: SP

గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం పోలీస్ గ్రీవెన్స్ డే జరిగింది. ఎస్పీ వకుల్ జిందాల్ పోలీస్ సిబ్బంది సమస్యలను తెలుసుకొని అర్జీలు స్వీకరించారు. శాఖపరమైన చర్యలు ఎదుర్కొంటున్న సిబ్బందిని విచారణ అనంతరం విధుల్లోకి తీసుకుంటామని చెప్పారు. ప్రజలకు ఉత్తమమైన సేవలు అందిస్తూ పొలీస్ శాఖ పట్ల నమ్మకాన్ని పెంపొందించాలని సూచించారు.
News March 6, 2026
ఈ నెల 10న జడ్పీలో జన్ సున్ వాయ్: GNT కలెక్టర్

జన్ సున్ వాయ్ (పబ్లిక్ హియరింగ్) కార్యక్రమాన్ని ఈ నెల 10వ తేదీన నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా తెలిపారు. రాష్ట్ర మహిళా కమిషన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని అన్నారు. 10న ఉదయం 10 గంటల నుంచి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈ కార్యక్రమం ఉంటుందని అన్నారు. ప్రజల నుంచి వినతులు, పెండింగ్ అంశాలను స్వీకరించడం జరుగుతుందన్నారు.


