News April 19, 2024
జనసేన అమలాపురం పార్లమెంట్ ఇన్‌ఛార్జి రాజీనామా

అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జి డీఎంఆర్ శేఖర్ శుక్రవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజమహేంద్రవరంలోని పార్టీ క్యాంపు కార్యాలయంలో రాజీనామా పత్రాన్ని శేఖర్ విడుదల చేశారు. 2019 నుంచి తాను జనసేన పార్టీలో సిన్సియర్ కార్యకర్తగా పని చేశానన్నారు. పార్టీ తీసుకున్న నిర్ణయాల పట్ల తీవ్ర అసంతృప్తితో రాజీనామా చేశానని లేఖలో స్పష్టం చేశారు. అమలాపురం జనసేన టికెట్‌ను శేఖర్ ఆశించారు.
Similar News
News October 9, 2025
రాజమండ్రిలో పవన్ కళ్యాణ్‌కు కలెక్టర్ స్వాగతం

కాకినాడ జిల్లా పర్యటన నిమిత్తం గురువారం రాజమండ్రి మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఘన స్వాగతం లభించింది. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆయనకు మొక్క అందించి ఆహ్వానించారు. కొద్దిసేపటి తరువాత జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ అక్కడి నుండి కాకినాడకు పయనమయ్యారు.
News October 9, 2025
తూ.గో జిల్లా అడహాక్ కమిటీ ఛైర్మన్‌గా మీసాల మాధవరావు

ఏపీ ఎన్జీవో సంఘం తూర్పుగోదావరి జిల్లాఅడహాక్ కమిటీ ఛైర్మన్‌గా మీసాల మాధవరావు ఎన్నికయ్యారు. బుధవారం సాయంత్రం రాజమండ్రి రోటరీ హాల్లో నిర్వహించిన తూర్పుగోదావరి జిల్లా సమావేశంలోఅడహాక్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. కో ఛైర్మన్ ప్రవీణ్ కుమార్, కన్వీనర్‌గా అనిల్ కుమార్, ఆర్థిక సభ్యుడిగా సత్యనారాయణ రాజు, సభ్యులుగా వెంకటేశ్వరరావు, నందీశ్వరుడు, ఎస్ వెంకటరమణ ఎన్నికయ్యారు.
News October 9, 2025
ఆఫ్రికా నత్తల నిర్మూలనకు చర్యలు చేపట్టాం: కలెక్టర్

తూ.గో జిల్లాలో ఆఫ్రికా నత్తల నిర్మూలనకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి వెల్లడించారు. బుధవారం రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరు కలెక్టరేట్‌లో ఉద్యాన శాఖ పనులపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..జిల్లాలో సుమారు 176 హెక్టార్లలో ఉద్యాన పంటలపై ఆఫ్రికా నత్తల ప్రభావం ఉన్నట్లు గుర్తించామన్నారు.