News March 19, 2024

జనసేన జెండా ఎగరేసేందుకు కృషి చేయాలి: వర్మ

image

గొల్లప్రోలు మండలం చందుర్తిలో నిర్వహించిన బీసీ, ఎస్సీల అవగాహన సదస్సులో పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి SVSN వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు ఆదేశాల మేరకు పిఠాపురంలో జనసేన జెండా ఎగరేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. టీడీపీ- జనసేన- బీజీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పిఠాపురం నియోజవర్గ అభివృద్ధి విషయంలో సహకరిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.

Similar News

News March 29, 2025

రాజమండ్రి: తప్పిన పెను ప్రమాదం..41 మంది సేఫ్

image

ఆర్టీసీ డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. గోకవరం డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు శనివారం ఉదయం భద్రచలం నుంచి రాజమండ్రికి బయలుదేరింది. బస్సు కూనవరం ఘాటీలో దుర్గమ్మ గుడి దాటిన తర్వాత ఒక్కసారిగా బ్రేక్ ఫెయిలయ్యింది. గమనించిన డ్రైవర్ ఎంతో చాకచక్యంగా వ్యవహరించి బస్సును నిలువరించాడు. బస్సులో ప్రయాణిస్తున్న 41 మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్‌ను ప్రయాణీకులు అభినందించారు.

News March 29, 2025

తూ.గో: పదో తరగతి పరీక్ష వాయిదా- DEO

image

ఈనెల 31న జరగాల్సిన టెన్త్ సోషల్ స్టడీస్ పరీక్ష రంజాన్ కారణంగా వాయిదా పడింది. ఈ ఎగ్జామ్‌ను ఏప్రిల్ 1న (మంగళవారం) నిర్వహిస్తామని జిల్లా విద్యాశాఖ అధికారి కె.వాసుదేవరావు అన్నారు. సోషల్ పరీక్ష మంగళవారం యథావిధిగా జరుగుతుందని, విద్యార్థులు గమనించాలని శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో 31న స్టోరేజీ పాయింట్ల నుంచి ప్రశ్నపత్రాలు, మెటీరియల్‌ను తీసుకెళ్లొద్దని సిబ్బందికి స్పష్టం చేశారు.

News March 28, 2025

అనపర్తి: కాలువలో పడి 4ఏళ్ల చిన్నారి మృతి

image

అనపర్తి మండలం కొప్పవరంలో శుక్రవారం విషాద ఘటన జరిగింది. 4ఏళ్ల చిన్నారి అనూష భార్గవి ప్రమాదవశాత్తు కాలువలో పడి చనిపోయింది. చిన్నారి ఇంటి వద్ద ఆడుకుంటూ కనిపించకుండా పోయిందని తండ్రి దొరబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఇంటి పక్కనే పంట కాలువ ఉండడంతో ఆ కోణంలో పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు. అనంతరం పాప మృతదేహం లభించింది.

error: Content is protected !!