News November 24, 2024
జన్నారం: అటవీ క్షేత్రాన్ని పరిశీలించిన కలెక్టర్
జన్నారం మండలంలోని కవ్వాల్ అభయారణ్య అటవీ క్షేత్రాన్ని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించారు. ఆదివారం సాయంత్రం ఆయన జన్నారం మండలంలోని గోండుగూడా అటవీ ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా అడవి, వన్యప్రాణుల రక్షణకు అటవీ అధికారులు తీసుకుంటున్న చర్యల గురించి తెలుసుకున్నారు. అలాగే అటవీ అధికారులను, సిబ్బందిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News November 24, 2024
నిర్మల్: రేపటి నుంచి ప్రజా ఫిర్యాదుల విభాగం
నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో రేపటి నుంచి యథావిధిగా ప్రతి సోమవారం ప్రజా ఫిర్యాదుల విభాగాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదివారం తెలిపారు. అర్జీదారులు ఈ విషయాన్ని గ్రహించి తమ అర్జీలను అధికారులకు సమర్పించుకోవచ్చని సూచించారు.
News November 24, 2024
బెల్లంపల్లిలో కారు బోల్తా.. ఇద్దరు మృతి
బెల్లంపల్లిలో విషాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం జాతీయ రహదారిపై కారు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అమ్మమ్మ, మనవరాలు మృతి చెందారు. కన్నాలబస్తీకి చెందిన రాజేశ్ తన కుటుంబంతో భూపాలపల్లిలోని ఓ శుభకార్యానికి వెళ్లి వస్తున్నారు. కారు బెల్లంపల్లి వద్దకు రాగానే అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో రాజేశ్ అత్త కళ్యాణి, కూతురు ప్రియమేఘన స్పాట్లోనే చనిపోయారు. అతడి భార్య అలేఖ్య, కుమారుడు సాయి తీవ్రంగా గాయపడ్డారు.
News November 24, 2024
ADB: మాజీ సైనికులకు ఆర్టీసీలో ఉద్యోగాలు
సైనిక సంక్షేమ శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మాజీ సైనికులకు TGS RTCలో ఉద్యోగాలు కల్పించనుంది. ఈ మేరకు RTC నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 1,201 డ్రైవింగ్ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిన భర్తీ చేయనున్నారు. ఉమ్మడి జిల్లాలో 92 ఉద్యోగాలు ఉన్నట్లు పేర్కొన్నారు. 18నెలల అనుభవంతో కూడిన హెవీ డ్యూటీ లైసెన్స్, 58 ఏళ్లలోపు వయస్సు ఉన్నవారు అర్హులు. ఈనెల 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.