News February 23, 2025
జన్నారం: ఈ స్వామి మౌనదీక్షకు 50 ఏళ్లు

జన్నారం మండలం రోటిగూడ గీతా మందిర్ నిర్వాహకులు స్వామి మౌన దీక్షకు 50 ఏళ్లు పూర్తయ్యాయి. ప్రజలలో ఆధ్యాత్మిక భావనను పెంచేందుకు 1975లో ఆయన మౌన దీక్షను చేపట్టారు. అప్పటినుంచి మౌనస్వామి గీతాశ్రమం ద్వారా పూజా, ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మౌనస్వామి మౌనదీక్ష చేపట్టి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీరాముల గంగాధర్, భక్తులు ఆయనను సన్మానించారు.
Similar News
News February 23, 2025
పెళ్లిలోనూ భారత్ VS పాక్ మ్యాచ్ LIVE

భారత్, పాకిస్థాన్ మ్యాచ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హైదరాబాద్‌లోని ఓ పెళ్లి మండపంలో మ్యాచ్‌ను చూసేందుకు ఏకంగా స్క్రీన్ ఏర్పాటు చేశారు. అతిథులు ఓ వైపు పెళ్లి, మరోవైపు మ్యాచ్‌ను ఆస్వాదిస్తున్నారు. ఇవాళ సండే కావడంతో దాదాపు అందరి ఇళ్లలోనూ టీవీల్లో ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి.
News February 23, 2025
పాకిస్థాన్‌తో మ్యాచ్.. తిరిగి వచ్చిన షమీ

ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచులో భారత స్టార్ బౌలర్ షమీ మైదానాన్ని వీడి, తిరిగి వచ్చారు. బౌలింగ్ వేస్తున్న సమయంలో కాలి మడమ నొప్పితో ఇబ్బంది పడ్డారు. కాసేపటి తర్వాత తిరిగి వచ్చారు. మరోవైపు పాకిస్థాన్ 8.2 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 41 పరుగులు చేసింది. బాబర్ ఔటయ్యారు.
News February 23, 2025
టన్నెల్ లోపలికి వెళ్లిన మంత్రి జూపల్లి

TG: శ్రీశైలం SLBC టన్నెల్ పైకప్పు కూలిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 8 మంది ఆచూకీ కోసం రెస్క్యూ బృందాలు గాలిస్తున్నాయి. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. సైనిక బృందాలతో పాటు టన్నెల్‌లోనికి మంత్రి జూపల్లి వెళ్లారు. నీరు, బురద ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది.