News August 23, 2025

జన్నారం: కడెం ప్రాజెక్టుకు తగ్గిన ఇన్ ఫ్లో..

image

గత 2 రోజుల నుంచి వర్షాలు లేకపోవడంతో ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి 3522 క్యూసెక్కుల వరద నీరు మాత్రమే ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుందని ప్రాజెక్టు అధికారులు శనివారం ఉదయం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 700 అడుగులు కాగా ప్రస్తుతం 697.150 అడుగుల నీటిమట్టం నిలువ ఉందన్నారు. ప్రాజెక్టు కుడి ఎడమ కాలువలకు మిషన్ భగీరథకు మొత్తం 495 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.

Similar News

News August 23, 2025

నేడు ఖాతాల్లోకి డబ్బులు

image

AP: 2014-19 మధ్య జరిగిన నరేగా(ఉపాధి హామీ పథకం) పనుల బిల్లులు ఇవాళ విడుదల కానున్నాయి. క్లోజ్ చేసిన 3,54,177 పనులను CM చంద్రబాబు కేంద్రంతో మాట్లాడి ఆన్ గోయింగ్ వర్కులుగా మార్పు చేయించారని TDP తెలిపింది. దీంతో ₹180Cr చెల్లింపులకు మార్గం ఏర్పడిందని, అందులోంచి ₹145Cr ఇవాళ కాంట్రాక్టర్లు, కార్మికుల ఖాతాల్లో జమ కానున్నట్లు పేర్కొంది. YCP ప్రభుత్వం కుట్ర పూరితంగా వీటిని నిలిపివేసిందని ఆరోపించింది.

News August 23, 2025

టంగుటూరికి ఎస్.కోటతో ఉన్న అనుబంధం మీకు తెలుసా?

image

ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి సీఎంగా టంగుటూరి ప్రకాశం పంతులు బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో ఆయన MLA కాదు. దీంతో అప్పుడు (1953) విశాఖపట్నం పరిధిలో ఉన్న ఎస్.కోట నియోజకవర్గం ఎమ్మెల్యే చాగంటి వెంకట సోమయాజులు స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. దీంతో ప్రకాశం పంతులు అక్కడి నుంచి పోటీ చేసి ఏకగ్రీవంగా ఎన్నికై సీఎంగా కొనసాగారు. నేడు ఆయన జయంతిని జిల్లాలో ఘనంగా నిర్వహిస్తున్నారు.

News August 23, 2025

ఖమ్మం మార్కెట్‌లో దొంగ సెస్ బిల్లుల కలకలం

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో నకిలీ సెస్ బిల్లులు కలకలం సృష్టించాయి. వివరాలిలా ఉన్నాయి.. మార్కెట్‌లో పత్తి వ్యాపారం చేసే ఒక ట్రేడర్, మరో వ్యాపారి సెస్ పుస్తకాలను దొంగిలించి, వాటిని నకిలీగా ముద్రించినట్లు తెలుస్తోంది. ఆ దొంగ బిల్లులను ఉపయోగించి, గుంటూరులోని ఒక ప్రముఖ సంస్థకు భారీ మొత్తంలో పత్తిని విక్రయించారు. బిల్లులు సరిపోలకపోవడంతో మార్కెట్‌లో విచారించగా, నకిలీ బిల్లుల బాగోతం వెలుగులోకి వచ్చింది.