News October 25, 2025
జన్నారం: కూతురితో తల్లి సూసైడ్.. కారణం ఇదే..!

జన్నారం మందపల్లిలో <<18091156>>కూతురితో తల్లి<<>> ఆత్మహత్య చేసుకోవడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ఎస్సై అనూష ప్రకారం.. మందపల్లి వాసి శ్రావణ్ జగిత్యాల జిల్లా వాసి స్పందనను పెళ్లి చేసుకున్నాడు. వారికి 3ఏళ్ల మోక్షశ్రీ, 11 నెలల వేదశ్రీ ఉన్నారు. 6 నెలలుగా స్పందన మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకుంటానని అనడంతో కుటుంబీకులు జాగ్రత్తగా కనిపెడుతున్నారు. శుక్రవారం 11 నెలల వేదశ్రీతో కలిసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.
Similar News
News October 25, 2025
కడప జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవులు

‘మోంతా’ తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో ఈ నెల 27, 28 తేదీల్లో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటిస్తున్నట్టు కడప JC అదితి సింగ్ శనివారం తెలిపారు. తుపాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఆదివారం కూడా సెలవు కావడంతో వరుసగా 3 రోజులు సెలవు వచ్చాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
News October 25, 2025
పదేళ్లలో టెస్లా మూత పడొచ్చు: కార్లోస్ తవారెస్

ఆటోమొబైల్ రంగం నుంచి టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తప్పుకోవచ్చని ఆటో జెయింట్ స్టెల్లాంటిస్ సంస్థ మాజీ CEO కార్లోస్ తవారెస్ అభిప్రాయపడ్డారు. ‘AI, స్పేస్ ఎక్స్, హ్యూమనాయిడ్ రోబోస్ మీద మళ్లీ ఫోకస్ చేసేందుకు మస్క్ టెస్లా నుంచి తప్పుకోవచ్చు. చైనాకు చెందిన BYD సంస్థ జోరు ముందు టెస్లా కంపెనీ ఓడిపోవచ్చు. పదేళ్ల తర్వాత ఎలాన్ మస్క్ కార్ల సంస్థ ఉంటుందని కూడా నేను చెప్పలేను’ అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
News October 25, 2025
పోలీస్ ప్రతిష్ఠను కాపాడండి: ఎస్పీ

పోలీస్ ప్రతిష్ఠ, గౌరవం, అధికారాన్ని కాపాడే విధంగా సిబ్బంది సమర్థవంతంగా విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి శనివారం సెట్ కాన్ఫరెన్స్ ద్వారా అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులు, సిబ్బందితో ఆయన మాట్లాడారు. పోలీస్ సిబ్బంది ఎల్లప్పుడూ లాఠీ, విజిల్ తమతో ఉంచుకోవాలని, అవసరమైతే వాటిని చట్టబద్ధంగా ఉపయోగించాలని ఎస్పీ సూచించారు.


