News March 21, 2025
జన్నారం: కెనాల్‌లో పడి డిగ్రీ విద్యార్థి మృతి

హుజూరాబాద్ మండలంలోని కాకతీయ కెనాల్‌లో గల్లంతై డిగ్రీ విద్యార్థి మృతిచెందాడు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన అరవింద్‌గా పోలీసులు గుర్తించారు. పోలీసుల వివరాలు.. గ్రామానికి చెందిన అరవింద్ కరీంనగర్‌లోని SRR డిగ్రీ కాలేజీలో చదువుతున్నాడు. 19వ తేదీన స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. కాగా, నిన్న మృతదేహం లభ్యమైంది.
Similar News
News March 28, 2025
పలిమెల: అగ్నివీర్ ఎంపికైన రాకేశ్

పలిమెల మండలం పంకెనకు చెందిన బొచ్చు లక్ష్మయ్య- పుష్పలతల కుమారుడు రాకేశ్ ఇటీవల ప్రకటించిన అగ్ని వీర్ ఆర్మీ ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించి, మెరిట్ లిస్టులో ఆర్మీ జనరల్ డ్యూటీ క్యాటగిరిలో ఎంపికయ్యాడు. రాకేశ్ మాట్లాడుతూ.. తప తల్లిదండ్రులు నిరంతరం కష్టపడుతూ తనను చదివించారని, వారి కృషి వల్లనే ఉద్యోగం సాధించానని తెలిపాడు.
News March 28, 2025
అనకాపల్లి ఎన్టీఆర్ బెల్లం మార్కెట్‌ను సందర్శించిన కలెక్టర్

అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ శుక్రవారం స్థానిక ఎన్టీఆర్ బెల్లం మార్కెట్ ను సందర్శించారు. మార్కెట్ యార్డ్ లో సమస్యలను కలెక్టర్‌కు ఎమ్మెల్యే వివరించారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. రైతు బజార్ ఏర్పాటు చేసి మార్కెట్ యార్డుకు పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. బెల్లం తయారు చేసే విధానాన్ని రైతులను అడిగి కలెక్టర్ తెలుసుకున్నారు.
News March 28, 2025
మామిడికుదురు: పాము కాటుకు గురై యువతి మృతి

మామిడికుదురు మండలం ఆదుర్రు గ్రామానికి చెందిన కంచి శృతి (24) పాము కాటుకు గురై మృతి చెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. ఉదయం 6.గంటల సమయంలో ఇంటి వద్ద బట్టలు ఉతుకుతుండగా చేతిపై పాము కాటు వేయడంతో స్థానికులు వెంటనే రాజోలు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.