News April 23, 2025

జన్నారం: గంజాయి రవాణా చేస్తున్న నలుగురి అరెస్ట్

image

జన్నారం మండలం పొనకల్‌కు చెందిన రాజేశ్, సమీర్, వినయ్, మందపల్లికి చెందిన బాలాజీ గంజాయి రవాణా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నట్లు ఎస్సై రాజవర్ధన్ తెలిపారు. వారి నుంచి1.020 కిలోల గంజాయి, రూ.50 వేల నగదు, హోండా యాక్టివా, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. గంజాయి రవాణా చేసిన తాగిన చర్యలు తప్పవన్నారు.

Similar News

News December 18, 2025

నందిపేట్ టాప్.. ఆర్మూర్ లాస్ట్

image

NZB జిల్లాలో తుది దశ ఎన్నికల్లో ఓటింగ్ 76.45% నమోదైంది. నందిపేట్-78.7%తో ముందు వరుసలో ఉండగా ఆర్మూర్-74.77%తో చివర్‌లో ఉంది. ఆలూర్-76.09%, బాల్కొండ-75.05%, భీమ్‌గల్-76.06%, డొంకేశ్వర్-78.06%, కమ్మర్‌పల్లి-75.19%, మెండోరా-76.29%, మోర్తాడ్-76.44%, ముప్కాల్-77.99%, వేల్పూర్-75.841%, ఏర్గట్ల-78.64% పోలింగ్ నమోదయ్యింది. 12 మండలాల్లో 3,06,795 మందికి గాను 2,34,546 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.

News December 18, 2025

ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

ఆయిల్ ఇండియా లిమిటెడ్(<>OIL<<>>) 8 కెమిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. MSc(కెమిస్ట్రీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు జనవరి 7న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. వయసు 18 నుంచి 45ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. నెలకు రూ.70,000 చెల్లిస్తారు. మెరిట్ లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.oil-india.com

News December 18, 2025

MBNR: రేపు అంబులెన్స్‌ డ్రైవర్ల నియామకానికి ఇంటర్వ్యూలు

image

మహబూబ్‌నగర్‌ జిల్లాలోని 102 అంబులెన్స్‌ల్లో డ్రైవర్ల నియామకానికి ఈ నెల 19న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు కోఆర్డినేటర్ ఉదయ్ కుమార్ తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు, మూడేళ్ల డ్రైవింగ్ అనుభవం, బ్యాడ్జి నంబర్ కలిగి ఉన్న 35 ఏళ్లలోపు వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఆసక్తిగల అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో జిల్లా ఆసుపత్రిలోని 108 కార్యాలయంలో హాజరు కావాలి. 9491271103ను సంప్రదించాలని ఆయన కోరారు.