News April 1, 2025

జన్నారం: గ్రూప్-1లో అనిల్ కుమార్‌కు 161 ర్యాంక్

image

జన్నారం మండలం పొన్కల్ గ్రామానికి చెందిన నగరు హరిదాస్ భాగ్యలక్ష్మి దంపతుల మూడవ కుమారుడు అనిల్ కుమార్ ఇటీవలే వెలువడిన గ్రూప్- 1 ఫలితాలలో 161 ర్యాంకు సాధించారు. అనిల్ కుమార్ గతేడాది గ్రూప్-4కు ఎంపికై హైదరాబాదులో ఉస్మానియా యూనివర్సిటీలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. తండ్రి హరిదాస్ ఆర్టీసీ కండక్టర్‌గా విధులు నిర్వహించి అయిదేళ్ల క్రితమే అనారోగ్యంతో మృతి చెందాడు.

Similar News

News November 5, 2025

లంకా దినకర్ నెల్లూరు జిల్లా పర్యటన వాయిదా

image

20 అంశాల కార్యక్రమ అమలు కమిటీ ఛైర్మన్ లంకా దినకర్ నెల్లూరు జిల్లా పర్యటన వాయిదా పడినట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. షెడ్యూల్ ప్రకారం ఆయన బుధవారం జిల్లాలోని ఏదో ఒక ప్రభుత్వ పాఠశాల అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి, సాయంత్రం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం నిర్వహించాల్సి ఉంది. అనివార్య కారణాలవల్ల ఈ పర్యటన వాయిదా పడినట్లు కలెక్టర్ వెల్లడించారు.

News November 5, 2025

వనపర్తి: జిల్లా వ్యాప్తంగా 1,61,314 రేషన్ సంచులు పంపిణీ

image

వనపర్తి జిల్లా వ్యాప్తంగా 327 రేషన్ దుకాణాలకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో 1,61,314 సంచులను సరఫరా చేసింది. ప్రతి రేషన్ కార్డు లబ్ధిదారునికి కాటన్ సంచులను సరఫరా చేయడంతో ప్రజలు సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఆన్‌లైన్‌లో వేలిముద్ర వేసి బియ్యాన్ని తీసుకున్న వారికి మాత్రమే సంచులను సరఫరా చేయనున్నట్లు అధికారులు, రేషన్ డీలర్లు తెలియజేశారు.

News November 5, 2025

BSNL ఫైబర్.. బేసిక్ ప్లాన్ కేవలం రూ.399!

image

సరసమైన రీఛార్జ్ ప్యాక్స్‌తో యూజర్లను ఇంప్రెస్ చేస్తోన్న ప్రభుత్వ రంగ సంస్థ BSNL ఇప్పుడు అతి తక్కువ ధరకే ఫైబర్ బేసిక్ ప్లాన్‌ను అందిస్తోంది. BSNL తమ ఫైబర్ బేసిక్ ప్లాన్‌ను కేవలం ₹399గా నిర్ణయించింది. దీంతో 60 Mbps వేగంతో నెలకు 3300 GB డేటాను పొందగలరు. ఆ తర్వాత 4Mbps వేగంతో డేటా లభిస్తుందని సంస్థ ప్రకటించింది. ఈ ఆఫర్‌లో మొదటి నెల ఉచితం కాగా.. తొలి 3 నెలలు ప్లాన్‌పై అదనంగా ₹100 తగ్గింపు ఉంటుంది.