News January 27, 2025

జన్నారం: పడగ విప్పిన పాములా బండరాయి

image

జన్నారం మండలంలోని ఇందన్పల్లి అటవీ రేంజ్‌లో ఉన్న అడవిలో ఓ రాయి పడగ విప్పిన పాములా ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మైసమ్మ కుంట నుంచి గనిశెట్టి కుంటకు వెళ్లే మార్గంలో అడవి మధ్యలో పడగ విప్పిన పాము మాదిరిగా రాయి దర్శనమిచ్చింది. దగ్గరకు వెళ్లి చూస్తే అది బండ రాయిగా కనిపిస్తుందని ఎఫ్ఆర్ఓ కారం శ్రీనివాస్ తెలిపారు. అయితే అటవీ నిబంధనలు ఉండటంతో దాని సందర్శనకు అనుమతి లేదన్నారు.

Similar News

News February 21, 2026

లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు

image

గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం చట్టవిరుద్ధమని ఆర్డీవో కేశవ నాయుడు హెచ్చరించారు. డివిజనల్ స్థాయి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పీసీపీఎన్‌డీటీ చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేస్తామని తెలిపారు. నిబంధనలు అతిక్రమించే స్కానింగ్ కేంద్రాల అనుమతులు రద్దు చేయడంతో పాటు, జరిమానాలు, క్రిమినల్ చర్యలు తప్పవన్నారు. లింగ వివక్ష నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

News February 21, 2026

తల్లిపాలు పెంచే ఫుడ్స్ ఇవే..

image

మొదటిసారి తల్లైన తర్వాత మహిళలకు ఎన్నో సవాళ్లు వస్తుంటాయి. వాటిల్లో ఒకటే తగినంత పాలు ఉత్పత్తికాకపోవడం. ఇలాంటప్పుడు కొన్ని ఆహారాలను డైట్‌లో భాగం చేసుకోవాలంటున్నారు నిపుణులు. పాలకూర, మెంతికూర, బ్రకోలీ, బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్, ఖర్జూరం వంటి డ్రై ఫ్రూట్స్, వెల్లుల్లి, ఓట్స్, నువ్వులు, మెంతులు తింటూ ఉంటే పాల ఉత్పత్తి పెరుగుతుందంటున్నారు. అలాగే వ్యాయామాలు, ధ్యానం చేయడం కూడా మంచిదని సూచిస్తున్నారు.

News February 21, 2026

పదో తరగతిలో ఉత్తమ ఫలితాలే లక్ష్యం: కలెక్టర్ రాజర్షి షా

image

పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. విద్యార్థుల తల్లిదండ్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరీక్షల సన్నద్ధతపై దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాలల్లో ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని, విద్యార్థులు వీటిని సద్వినియోగం చేసుకునేలా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు.