News November 4, 2025

జన్నారం: లారీ-బైక్ ఢీ.. ఒకరి స్పాట్ డెడ్

image

జన్నారం మండలంలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందాగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం.. చింతగూడ-మహమ్మదాబాద్ గ్రామాల మధ్య లారీ-బైక్ ఢీకొన్నాయి. బైక్‌పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరొకరు తీవ్రంగా గాయపడగా అతన్ని 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 4, 2025

మీర్జాగూడ ఘటన.. ఆ గుంత పూడ్చివేత

image

చేవెళ్ల మండలం మీర్జాగూడలో నిన్న ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొన్న ఘటనలో 19 మంది మరణించిన విషయం తెలిసిందే. కాగా ప్రమాదానికి కారణమైన గుంతను అధికారులు ఈరోజు పూడ్చివేసినట్లు స్థానికులు తెలిపారు. రోడ్డుపై ఏర్పడ్డ గుంతను తప్పించడానికి టిప్పర్ డ్రైవర్ ప్రయత్నించడమే ఈ ఘటనకు ప్రధాన కారణమని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ముందే రోడ్డుకు మరమ్మతులు చేసి ఉంటే అంత మంది ప్రాణాలు పోయేవి కావంటున్నారు.

చిత్తూరు: ఇంజినీరింగ్ విద్యార్థి సూసైడ్

image

చిత్తూరులోని ఓ కాలేజీలో బీటెక్ సెకండియర్ విద్యార్థి మూడో అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ కాలేజీలో వారంలోపే రెండో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు తెలియాల్సి ఉంది.