News January 7, 2026
‘జన నాయకుడు’ విడుదలపై వీడని ఉత్కంఠ

విజయ్ ‘జన నాయకుడు’ సినిమా విడుదలకు గండం తప్పేలా లేదు. సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలంటూ నిర్మాతలు మద్రాస్ హైకోర్టుకు వెళ్లగా తీర్పు రిజర్వ్ చేసింది. ఈనెల 9న సినిమా విడుదల కావాల్సి ఉండగా అదే రోజు తీర్పు చెప్పే అవకాశం ఉందని న్యాయస్థానం పేర్కొంది. దీంతో సినిమా విడుదల టెక్నికల్‌గా వాయిదా పడినట్టేనని తెలుస్తోంది.
Similar News
News January 8, 2026
ఈడీ రెయిడ్స్.. ఇంతకీ ప్రతీక్ జైన్ ఎవరు?

ఐప్యాక్ ఆఫీసు, ఆ సంస్థ డైరెక్టర్ ప్రతీక్ జైన్ ఇంటిపై <<18796717>>ED దాడులు<<>> చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రతీక్ జైన్ ఎవరనే చర్చ జరుగుతోంది. IIT బాంబే పూర్వ విద్యార్థి అయిన ప్రతీక్ ఎన్నికల వ్యూహం, డేటా విశ్లేషణలో ఎక్స్‌పర్ట్. I-PAC కోఫౌండర్. 2019 నుంచి TMCతో కలిసి పని చేస్తున్నారు. ఆ పార్టీ IT సెల్ హెడ్‌గానూ ప్రతీక్ కొనసాగుతున్నారు. TMCతోపాటు పలు పార్టీలు, ప్రభుత్వాలకు సలహాదారుగా I-PAC వ్యవహరిస్తోంది.
News January 8, 2026
ప్రభుత్వ స్కూళ్లలో బ్రేక్ ఫాస్ట్.. సీఎం సమీక్ష

TG: సెంట్రలైజ్డ్ కిచెన్స్ ద్వారా ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమైన బ్రేక్ ఫాస్ట్, లంచ్ అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను CM రేవంత్ ఆదేశించారు. ప్రతి రెండు నియోజకవర్గాలకు ఒక సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేయాలని రివ్యూ మీటింగ్‌లో సూచించారు. ‘సోలార్ కిచెన్‌ల ఏర్పాటును పరిశీలించాలి. యంగ్ ఇండియా స్కూళ్ల పనుల్ని వేగవంతం చేయాలి. ఇందుకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపుల్లో ప్రాధాన్యతనివ్వాలి’ అని చెప్పారు.
News January 8, 2026
ఆన్‌లైన్‌లోనే పొదుపు సంఘాలకు రుణాలు: చంద్రబాబు

AP: పొదుపు సంఘాలు ఆన్‌లైన్‌లోనే రుణాలు తీసుకునే సదుపాయం త్వరలో వస్తుందని CM చంద్రబాబు తెలిపారు. బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పని ఉండదని చెప్పారు. 1.13 కోట్ల మంది సభ్యులు పొదుపు సంఘాల ద్వారా రూ.26 వేల కోట్ల నిధిని ఏర్పాటు చేశారని అభినందించారు. గుంటూరులో నిర్వహించిన సరస్ మేళాలో ఆయన మాట్లాడారు. ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త రావాలని, MSMEలు పెట్టుకోవాలని సూచించారు.


