News July 29, 2024
జపాన్‌లో జరిగే పోటీలకు ఎంపికైన బోథ్ విద్యార్థిని

రాష్ట్ర స్థాయి సకురా సైన్స్ ప్రొగ్రామ్ పోటీలకు బోథ్ ఆదర్శ పాఠశాల విద్యార్థిని రసజ్ఞ ఎంపికయ్యారు. గత సంవత్సరం పదోతరగతి ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు జిల్లా స్థాయిలో రాత పరీక్ష, ఇంటర్వ్యూలు, ఇంగ్లిష్‌లో ప్రావీణ్య పోటీలను నిర్వహించారు. రసజ్ఞ రాష్ట్ర స్థాయిలో తన ప్రతిభను చాటింది. రాష్ట్ర స్థాయిలో ఐదుగురు విద్యార్థులను ఎంపిక చేసి జపాన్ పర్యటనకు పంపనున్నారు.
Similar News
News August 7, 2025
బోథ్: CM రేవంత్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ నేతలు

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బోథ్ నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ ఛార్జ్ ఆడే గజేందర్ ఢిల్లీలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నరసయ్యకు పదవి ఇప్పించినందుకు గాను సీఎంకు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం నియోజకవర్గంలో ప్రజలకు అందజేస్తున్న సంక్షేమ పథకాలు, తాజా రాజకీయాలను సీఎంతో చర్చించినట్లు గజేందర్ పేర్కొన్నారు.
News August 7, 2025
తలమడుగు: ఇంటి నుంచి వెళ్లి శవమై తేలాడు

తలమడుగు మండలంలో ఓ వ్యక్తి ఇంటి నుంచి వెళ్లి శవమై కనిపించాడు. SI రాధిక వివరాల ప్రకారం.. మండలం సుంకిడి కి చెందిన దాసరి ప్రశాంత్ ఇంట వారసత్వ భూమి విషయంలో ప్రతిరోజు మద్యం మత్తులో తండ్రి ఎర్రన్నతో గోడవపడేవాడు. ఈ నెల 6న మద్యం మత్తులో ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. గురువారం సుంకిడి వాగులో శవమై కనిపించగా తండ్రి ఎర్రన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
News August 6, 2025
ఆదిలాబాద్: కృష్ణ ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు సూచన

విజయవాడ డివిజన్లో లైబీ బ్లాక్ కారణంగా ADB నుంచి తిరుపతి వరకు నడిచే కృష్ణ ఎక్స్ ప్రెస్‌ను కొద్దీ రోజులు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. రైలు నంబర్ 17406 ADB నుంచి తిరుపతి నడిచే రైలు ఈనెల 8,10,12 తేదీలలో రెండు గంటలు ఆలస్యంగా ఉంటుందన్నారు. రైలు నంబర్ 17405 తిరుపతి నుంచి ADB నడిచే రైలు ఈనెల 13 నుంచి 19 వరకు రద్దు, 17406 ADB నుంచి తిరుపతి ఈనెల 14 నుంచి 20 వరకు రద్దు చేస్తున్నామన్నారు.