News December 12, 2025

జపాన్‌లో మళ్లీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

image

జపాన్‌లో వరుస <<18509568>>భూకంపాలు<<>> ప్రజలను హడలెత్తిస్తున్నాయి. ఇవాళ 6.7 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఉత్తర పసిఫిక్ తీరప్రాంతంలో సునామీ అలలు మీటర్ ఎత్తులో ఎగసిపడొచ్చని హెచ్చరించారు. కుజి నగరానికి 130 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడించింది. కాగా నాలుగు రోజుల కిందట ఇదే ప్రాంతంలో వచ్చిన భూకంపానికి పలు ఇళ్లు బీటలు వారగా 50 మంది గాయపడ్డారు.

Similar News

News December 12, 2025

మునగాకుతో ఎన్నో లాభాలు

image

ఆయుర్వేదంలో మునగకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. దీన్ని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో లాభాలున్నాయి. NCBI నివేదిక ప్రకారం.. మునగ ఆకుల్లో ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, విటమిన్-ఎ, సి, బి కాంప్లెక్స్, బీటా-కెరోటిన్, అమైనో యాసిడ్స్‌, ఫినోలిక్‌లతో పాటు, 40 కంటే ఎక్కువ రకాల యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇందులో ఉండే పీచు, జీర్ణవ్యవస్థతో పాటు పొట్టను ఆరోగ్యంగా ఉంచుతుంది.

News December 12, 2025

తండ్రయిన టాలీవుడ్ యంగ్ హీరో

image

టాలీవుడ్ యంగ్ హీరో తిరువీర్ తండ్రయ్యారు. ఆయన భార్య కల్పనారావు మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ సందర్భంగా తిరువీర్ తన ఆనందాన్ని X వేదికగా పంచుకున్నారు. ‘నాయినొచ్చిండు ❤️’ అంటూ బిడ్డ చేతిని పట్టుకున్న ఫొటోను షేర్ చేయగా అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ‘మసూద’, ‘పలాస 1978’, ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన తిరువీర్.. కల్పనారావును 2024లో వివాహం చేసుకున్నారు.

News December 12, 2025

‘అల్లూరి’ ప్రమాదంలో చనిపోయింది వీరే

image

AP: అల్లూరి జిల్లాలో జరిగిన <<18540010>>ప్రమాదంలో<<>> 9 మంది చనిపోయారు. వారిలో ఐదుగురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. వారి వివరాలు.. శైలా రాణి(తెనాలి), శ్యామల(తిరుపతి), పి.సునంద(పలమనేరు), శివశంకర్ రెడ్డి(పలమనేరు), నాగేశ్వరరావు(చిత్తూరు), కావేరి కృష్ణ(బెంగళూరు), శ్రీకళ(చిత్తూరు), దొరబాబు(చిత్తూరు), కృష్ణకుమారి(బెంగళూరు). కాగా గాయపడిన 25 మందికి చింతూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది.