News January 17, 2026
జపాన్ వెకేషన్‌లో అల్లు అర్జున్.. ఫ్యామిలీ పిక్ వైరల్

టోక్యోలోని సెన్‌సో-జి ఆలయానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలిసి వెళ్లారు. భార్య స్నేహా రెడ్డి, కొడుకు అయాన్, కూతురు అర్హతో దిగిన ఫోటోను SMలో ఆయన షేర్ చేశారు. షేర్ చేసిన క్షణాల్లోనే ఈ పిక్‌ను అభిమానులు వైరల్ చేసేశారు. సినిమాలు, ఫ్యామిలీకి సమానంగా టైమ్ కేటాయిస్తూ ఫ్యామిలీ మ్యాన్ అనిపించుకుంటున్నారని కామెంట్స్ పెడుతున్నారు.
Similar News
News February 2, 2026
అంబేడ్కర్ వర్సిటీ పరీక్షలు వాయిదా.. 17 నుంచి కొత్త షెడ్యూల్!

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో డాక్టర్ BR అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షలను వాయిదా వేసింది. ఫిబ్రవరి 11న పోలింగ్ ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. వాయిదా పడిన పరీక్షలు తిరిగి ఫిబ్రవరి 17 నుంచి మార్చి 10 వరకు జరుగుతాయి. హాల్‌టికెట్లను పరీక్షకు 3 రోజుల ముందు నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం వెబ్‌సైట్ లేదా స్టడీ సెంటర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు.
News February 2, 2026
జోగి రమేశ్ ఇంటి వద్ద భద్రత కల్పించాలి: హైకోర్టు

AP: మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటి వద్ద భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. జోగి రోహిత్ వేసిన పిటిషన్‌పై కోర్టు ఈ ఆదేశాలిచ్చింది. రమేశ్‌పై ఎలాంటి దాడులు జరిగినా పోలీసులదే బాధ్యత అని స్పష్టం చేసింది. కాగా ఇప్పటికే భద్రత కల్పించారని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు వివరించారు. కాగా జోగి రమేశ్ ఇంటిపై <<19023109>>దాడి ఘటనలో<<>> పోలీసులు 40 మందిపై కేసులు నమోదు చేశారు. నిందితుల్లో 11 మందిని అరెస్టు చేశారు.
News February 2, 2026
నాన్నకు ప్రేమతో.. కూతుళ్లు ఏం చేశారంటే?

కన్నతండ్రి జ్ఞాపకం కళ్లెదుటే ఉండాలని నల్గొండ జిల్లా కోతులారానికి చెందిన గౌరవతి, మమత తమ నాన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. తమను కొడుకుల్లా పెంచి, కంటిపాపలా చూసుకున్న వీరమళ్ల నర్సింహ గతేడాది అనారోగ్యంతో మరణించారు. నవమాసాలు మోయకపోయినా, తమ జన్మకు కారణమైన నాన్నే దైవమని నమ్మిన ఆ కుమార్తెలు రూ.6 లక్షలతో విగ్రహాన్ని ఏర్పాటు చేసి తండ్రీకూతుళ్ల బంధానికి నిలువుటద్దంగా నిలిచారు.


